NASA (Know this): నాసా కీలక నిర్ణయం.. సౌరవ్యవస్థలో కొత్త ప్రయోగం.! కానీ సైంటిస్టుల మాటేంటి..?(వీడియో)

NASA (Know this): నాసా కీలక నిర్ణయం.. సౌరవ్యవస్థలో కొత్త ప్రయోగం.! కానీ సైంటిస్టుల మాటేంటి..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 16, 2021 | 9:31 PM

నాసా మరోకొత్త పరిశోధనకు రెడీ అయింది. జుపిటర్‌ ట్రోజన్ గ్రహశకలాలను అన్వేషించాలనే లక్ష్యంతో లూసీ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను వచ్చే వారం ప్రయోగించనుంది నాసా. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యోమనౌక 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు.

నాసా మరోకొత్త పరిశోధనకు రెడీ అయింది. జుపిటర్‌ ట్రోజన్ గ్రహశకలాలను అన్వేషించాలనే లక్ష్యంతో లూసీ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను వచ్చే వారం ప్రయోగించనుంది నాసా. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యోమనౌక 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. ఈ వ్యవధిలో అంతరిక్ష నౌక ఎనిమిది గ్రహశకలాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సౌర వ్యవస్థపై మరింత లోతుగా పరిశోధనలు చేయడానికి ఇది 6.3 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ మిషన్‌కు లూసీ అనే పేరు పెట్టారు సైంటిస్టులు. ఈ అంతరిక్ష నౌక అంగారకుడు- బృహస్పతి మధ్య కనిపించే ప్రధాన బెల్ట్‌లో ఉండే గ్రహశకలాన్ని ముందు పరిశీలించనుంది. ఈ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి అక్టోబర్ 16న ప్రారంభించనున్నారు. అట్లాస్ V 401 రాకెట్‌పై ఇది నింగిలోకి వెళ్లనుంది. తదనంతరం అంతరిక్ష నౌక భూమిని రెండుసార్లు చుట్టివస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

మరిన్ని చదవండి ఇక్కడ : Monkey Feel Viral Video: కోతికి కోపం వచ్చింది.. ఒకసారి చెబితే వినాలి మరీ..! దెబ్బతిన్న వానరం మనోభావాలు.. వైరల్ వీడియో.

 Calf Viral Video: రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన లేగదూడ.. అమ్మవారి లీల అంటున్న నెటిజన్లు..(వైరల్ వీడియో)

 Madhya Pradesh Viral Video: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న విచిత్ర సంఘటన.. నాకు గత జన్మ గుర్తొచ్చింది..! (వైరల్ వీడియో)

 Konaseema Coconut Farmers: తీవ్ర అసహనంలో కోనసీమ కొబ్బరి రైతులు.. కలిసిరాని పండుగలు..!(వీడియో)