Konaseema Coconut Farmers: తీవ్ర అసహనంలో కోనసీమ కొబ్బరి రైతులు.. కలిసిరాని పండుగలు..!(వీడియో)
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కొబ్బరి రైతాంగం తీవ్ర నిరాశలో మునిగిపోయారు... వరుస పండుగలు వచ్చినా కొబ్బరి రైతులకు ఏ మాత్రం కలిసిరాలేదంటున్నారు...ఇతర రాష్ట్రాలకు కొబ్బరికాయ ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కొబ్బరి రైతాంగం తీవ్ర నిరాశలో మునిగిపోయారు… వరుస పండుగలు వచ్చినా కొబ్బరి రైతులకు ఏ మాత్రం కలిసిరాలేదంటున్నారు…ఇతర రాష్ట్రాలకు కొబ్బరికాయ ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొబ్బరిమార్కెట్ ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం గోదావరి జిల్లాల నుంచి 150 లారీలకు పైగా ఎగుమతులు జరిగేవి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి సరైన ఆర్డర్లు లేకపోవడంతో 30 నుంచి 40 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా డొక్కుతో ఉన్న కాయే పశ్చిమబెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో రైతులు ఆశించిన మేర మార్కెట్ పుంజుకోవడం లేదు. గోదావరి జిల్లాల్లో అతి ముఖ్యమైన మార్కెట్లలో ఒకటైన అంబాజీపేట మార్కెట్లో ఎగుమతులు లేక అటు వ్యాపారులు, ఇటు రైతులు డీలాపడ్డ పరిస్థితి కనిపిస్తోంది.. ముఖ్యంగా పచ్చికాయ చెయ్యింటికి ప్రస్తుతం 9వేల 200 రూపాయల నుంచి 9వేల 500 రూపాయల మధ్య ధర పలుకు
తోంది. ముక్కుడుకాయ కూడా 9 వేల రూపాయల నుంచి 9వేల 500 రూపాయల మధ్య ధర ఉండి..
కొత్త కొబ్బరి క్వింటాల్ ధర 10వేల 500 రూపాయలు, రెండోరకం 10 వేల రూపాయలు ధర పలుకుతోంది..ప్రస్తుతం కొబ్బరి దిగుబడులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దిగుబడులు తగ్గడం వల్ల రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొబ్బరికాయలు వినియోగం కరోనా నేపథ్యంలో తగ్గుముఖం పట్టింది. పండుగలకు కూడాపెద్దగా వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఎగుమతులు స్తంభించిపోయి ధరల పెరుగుదల ఉండదేమోనన్న ఆందోళనలో రైతాంగం ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Mahabubabad: వెరైటీ వ్యాక్యూమ్ క్లీనర్… పారిశుద్ధ్య కార్మికుడి ఐడియా అదుర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

