Madhya Pradesh Viral Video: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న విచిత్ర సంఘటన.. నాకు గత జన్మ గుర్తొచ్చింది..! (వైరల్ వీడియో)
మధ్యప్రదేశ్‌లోని అగర్‌మాల్వా జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సంశేర్ జనపద్ పంచాయతీ పరిధిలోని ఓ ఉద్యోగి పెట్టిన లీవ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్‌లో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్...
మధ్యప్రదేశ్‌లోని అగర్‌మాల్వా జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సంశేర్ జనపద్ పంచాయతీ పరిధిలోని ఓ ఉద్యోగి పెట్టిన లీవ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్‌లో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ లీవ్ కోసం రాసిన లేఖ చూసిన వారంతా ఆశ్యర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు..రాజ్‌కుమార్ తను పనిచేస్తున్న… పంచాయతీ చీఫ్‌కు లేఖ రాస్తూ.. ప్రతి ఆదివారం తనకు ‘డే ఆఫ్’ కావాలని కోరాడు… అయితే సెలవులు ఎందుకు కావాలన్న దానికి ఆ ఉద్యోగి రాసిన కారణమేంటంటే.. రాజ్ కుమార్‌కు ఇటీవల తన గత జన్మ గుర్తొంచిందంటా. గతకొన్ని రోజులుగా రాత్రి పడుకునే సమయంలో పోయిన జన్మ తాలుకూ జ్ఞాపకాలు కలలో వస్తున్నాయని, ఇందులో భాగంగానే తన గత జన్మ తాలుకూ విషయాలను తెలుసుకోవడానికి, భగవద్గీతను స్టడీ చేయడానికి సెలవు కావాలంటూ లేఖలో ప్రస్థావించాడు..దీంతో ఈ లేఖ కాస్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలవు కోసం ఇలాంటి కారణం కూడా చెప్పొచ్చని ఇప్పటి వరకు తెలియలేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Konaseema Coconut Farmers: తీవ్ర అసహనంలో కోనసీమ కొబ్బరి రైతులు.. కలిసిరాని పండుగలు..!(వీడియో)
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

