Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Feel Viral Video: కోతికి కోపం వచ్చింది.. ఒకసారి చెబితే వినాలి మరీ..! దెబ్బతిన్న వానరం మనోభావాలు.. వైరల్ వీడియో.

Monkey Feel Viral Video: కోతికి కోపం వచ్చింది.. ఒకసారి చెబితే వినాలి మరీ..! దెబ్బతిన్న వానరం మనోభావాలు.. వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 16, 2021 | 9:21 PM

మనో భావాలు, అత్మ గౌరవాలు కేవలం మనుషులకే ఉంటాయా...? మూగ జీవాలకు ఉండవా అంటే.. ఎందుకు ఉండవు మాకు ఉంటాయంటోంది..ఇక్కడో వానరం..ఓ జూ పార్క్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మనో భావాలు, అత్మ గౌరవాలు కేవలం మనుషులకే ఉంటాయా…? మూగ జీవాలకు ఉండవా అంటే.. ఎందుకు ఉండవు మాకు ఉంటాయంటోంది..ఇక్కడో వానరం..ఓ జూ పార్క్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇక్కడ కొందరు వ్యక్తులు జూ పార్క్‌ బోనులో ఉన్న ఓ కోతికి అరటి పండును తినిపించడానికి ప్రయత్నించారు. కానీ, ఆ వానరం మాత్రం తనకు వద్దు అన్నట్లుగా..ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోయింది…దీంతో సదరు వ్యక్తి మాత్రం దానికి బలవంతంగా తినిపించడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో దీనిని అక్కడే ఉన్న మరో వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. కోతికి నచ్చకపోయినప్పటికీ బలవంతంగా తినిపిస్తుండడంతో చిర్రెత్తుకు పోయిన వానరం కోపంతో ఒక్కసారిగా రెచ్చిపోయింది..వీడియో తీస్తున్న వ్యక్తి చేతిలోని ఫోన్‌ను కిందపడేసింది. అప్పటికి కూడా బలవంతంగా అరటి పండును తినిపించడానికి ప్రయత్నించడంతో ఆ పండ్లను కూడా కింద పడేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కోతికి బలవంతంగా అరటిని తినిపించడానికి ప్రయత్నించిన వారిని తప్పు పడుతూ కామెంట్లు చేశారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Calf Viral Video: రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన లేగదూడ.. అమ్మవారి లీల అంటున్న నెటిజన్లు..(వైరల్ వీడియో)

 Madhya Pradesh Viral Video: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న విచిత్ర సంఘటన.. నాకు గత జన్మ గుర్తొచ్చింది..! (వైరల్ వీడియో)

 Konaseema Coconut Farmers: తీవ్ర అసహనంలో కోనసీమ కొబ్బరి రైతులు.. కలిసిరాని పండుగలు..!(వీడియో)

 Mahabubabad: వెరైటీ వ్యాక్యూమ్‌ క్లీనర్‌… పారిశుద్ధ్య కార్మికుడి ఐడియా అదుర్స్.. వైరల్ అవుతున్న వీడియో..