Apple iPhone: ఐఫోన్లపై దాదాపు రూ. 27 వేలు తగ్గింపు.. ఏడాదిలో రెండోసారి..
యాపిల్ ఐఫోన్ కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాటి ధరలు. ఎప్పుడో కొత్త మోడల్ వస్తే గానీ పాత మోడళ్ల ధరలు తగ్గవు. అందుకే ఐఫోన్ వాడాలనుకునేవారు ఏ ఆఫర్‌లోనో తక్కువ ధరకు వచ్చినప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది చైనాలో యాపిల్ ఐఫోన్ల ధరలను అమాంతం తగ్గిస్తోంది. లేటెస్ట్ మోడళ్లపైనా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
యాపిల్ ఐఫోన్ కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాటి ధరలు. ఎప్పుడో కొత్త మోడల్ వస్తే గానీ పాత మోడళ్ల ధరలు తగ్గవు. అందుకే ఐఫోన్ వాడాలనుకునేవారు ఏ ఆఫర్‌లోనో తక్కువ ధరకు వచ్చినప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది చైనాలో యాపిల్ ఐఫోన్ల ధరలను అమాంతం తగ్గిస్తోంది. లేటెస్ట్ మోడళ్లపైనా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
అమెరికా, భారత్ తరహాలోనే యాపిల్‌కు చైనా అతిపెద్ద మార్కెట్. ప్రపంచ మార్కెట్‌లో శాంసంగ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చైనాలో మాత్రం హువావే సవాల్ విసురుతోంది. తన అమ్మకాలు పెంచుకుంటూ యాపిల్ మార్కెట్ వాటాకు గండిపెడుతోంది. ఇది యాపిల్‌ను కలవరపెడుతోంది. అందుకే సేల్స్ పెంచుకునేందుకు తంటాలు పడుతోంది. మే 28 వరకు యాపిల్ తన అధికారిక స్టోర్‌లో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్లను విక్రయిస్తోంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1 టీబీ వెర్షన్‌పై 2300 యువాన్లు మేర డిస్కౌంట్ అందిస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 27 వేల రూపాయలు తగ్గింపు అన్నమాట. ఐఫోన్ 15 బేస్ వేరియంట్‌పైనా 16 వేల రూపాయల మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా ధరలు తగ్గించడం ఇది రెండోసారి.
ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌కు హువావే గట్టి పోటీనిస్తోంది. ఇటీవల ఆ కంపెనీ ప్యూరా 70 సిరీస్, మేట్ 60 ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో తొలి త్రైమాసిక ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో యాపిల్ అమ్మకాలు 19 శాతం మేర తగ్గినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. హువావే మార్కెట్ వాటా 9.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరిగింది. హువావేతో పాటు ఇతర చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి కూడా యాపిల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయాల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే యాపిల్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.