ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్‌ ఏం చేశాడో తెలుసా ??

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే బాయ్ ఫ్రెండ్ అయితే.. అందరి కంటే భిన్నంగా ప్రయత్నించాడు.

Phani CH

|

Aug 12, 2022 | 9:41 AM

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే బాయ్ ఫ్రెండ్ అయితే.. అందరి కంటే భిన్నంగా ప్రయత్నించాడు. అదిరిపోయే గిఫ్ట్స్‌తో తన ప్రియురాలిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఏకంగా దొంగ అవతారాన్ని ఎత్తాడు. కట్ చేస్తే చివరికి జైలు పాలయ్యాడు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ మునాఫ్ అనే యువకుడు తన ప్రియురాలికి ఖరీదైన మొబైల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా.. దొంగ అవతారాన్ని ఎత్తి.. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపుకు కన్నం వేశాడు. పక్కా ప్లాన్ రచించాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి షాప్ మూసే సమయానికి మహిళల బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. షోరూమ్ మూసిన అనంతరం ఆరు ఖరీదైన సెల్‌ఫోన్లు పట్టుకుని ఉడాయించాడు. మరుసటి రోజు ఉదయం విధులకు వచ్చిన ఆ షాప్ సిబ్బంది.. సెల్‌ఫోన్ల చోరీ జరిగిందని గుర్తించారు. ఆపై పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు వెంటనే స్పాట్‌కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. దాని విజువల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కాగా, ఖాకీలు తమదైన శైలికి విచారణ చేపట్టగా.. నిందితుడి అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తన ప్రియురాలి కోసం ఈ దొంగతనాన్ని చేశానని.. అంతేగానీ వేరే ఉద్దేశం ఏం లేదని వెల్లడించాడు. అతడి సమాధానం విని పోలీసులు దెబ్బకు ఖంగుతిన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??

హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..

Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!

పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu