గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు
తన గర్ల్‌ఫ్రెండ్‌ను మెప్పించేందుకు ఓ యువకుడు దొంగగా మారాడు. తన స్నేహితునితో కలిసి ఏకంగా ఏటీఎం మిషన్‌నే కొల్లగెట్టేందుకు యత్నించాడు.
తన గర్ల్‌ఫ్రెండ్‌ను మెప్పించేందుకు ఓ యువకుడు దొంగగా మారాడు. తన స్నేహితునితో కలిసి ఏకంగా ఏటీఎం మిషన్‌నే కొల్లగెట్టేందుకు యత్నించాడు. కానీ, పాపం అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏటీఎంను ఎవరో దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు చేరటం..సదరు ప్రేమికుడు పోలీసులకు దొరికిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అతనితో పాటు..తోడుగా వచ్చిన తన ఫ్రెండ్‌ని కూడా అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టేశారు. పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను జూలై 30న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. జూలై 30 తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గ్యాస్ వెల్డర్‌తో ఏటీఎంను కట్‌చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు సమాచారం అందిందని పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: