Angry Elephant: ఏనుగుకు కోపం తెప్పిస్తే ఏమవుతుంది..తెలుసా? ఇదిగో ఇలా షేక్ అవ్వాల్సి వస్తుంది..

|

May 19, 2021 | 12:25 PM

Angry Elephant: సాధారణంగా జంతువులు వాటి మానాన అవిపోతాయి. మనషులు ఎదురుపడినా వీడితో మనకెందుకులే అని పక్క నుండి పోవడానికే ప్రయత్నిస్తాయి.

Angry Elephant: ఏనుగుకు కోపం తెప్పిస్తే ఏమవుతుంది..తెలుసా? ఇదిగో ఇలా షేక్ అవ్వాల్సి వస్తుంది..
Angry Elephant
Follow us on

Angry Elephant: సాధారణంగా జంతువులు వాటి మానాన అవిపోతాయి. మనషులు ఎదురుపడినా వీడితో మనకెందుకులే అని పక్క నుండి పోవడానికే ప్రయత్నిస్తాయి. కానీ, మనుషులే ఒక్కోసారి.. వాటిని చూసి భయపడో లేకపోతే వాటిని టీజ్ చేయాలనో కొన్ని చెత్త పనులు చేస్తారు. దాంతో వాటికి చిర్రెత్తుకు వస్తుంది. అప్పడు తమ స్టైల్ లో సమాధానం చెబుతాయి. అది పాము అనుకోండి ముచ్చటగా ఓ కాటు వేసేస్తుంది. పులో, సింహమో అయితే.. రెండు పీకులు పీకి ఈడ్చుకెళ్ళిపోతాయి. మరి ఏనుగు అయితే ఏం చేస్తుంది? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి.

ఈ వీడియోలో ఓ హైవేలో గజరాజు మెల్లగా నడుచుకుంటూ పోతోంది. ఇంతలో ఎదురుగా ఓ పెద్ద ట్రక్ వచ్చింది. ఆ ట్రక్ డ్రైవర్ భయపడ్డాడో లేకపోతే.. ఏనుగు సింగిల్ గానే ఉంది కదా ఏం చేస్తుందిలే అనుకున్నాడో హారన్ కొట్టి విసిగించాడు. నిజానికి ఆ ట్రాక్ డ్రైవర్ పక్కనుంచి వెళ్లిపోవచ్చు. కానీ, హారన్ మోగించాడు. దీంతో అంత శాంతంగా వెళుతున్న ఏనుగుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ ట్రక్ దగ్గరకు వచ్చి డ్రైవర్ వైపుకు వెళ్ళింది.. డ్రైవర్ క్యాబిన్ వద్ద తొండం పెట్టి ఒక్క ఊపు ఊపింది. మొత్తం ట్రక్ కదిలిపోయింది. దెబ్బకు ఆ డ్రైవర్ ట్రక్ స్టార్ట్ చేశాడు. ఇక చాలు అనుకుందో ఏమో.. ఆ ఏనుగు పక్కకు తిరిగి రోడ్డు దిగి అడవి వైపు వెళ్ళిపోయింది.
ఆ వీడియో మీరు చూడండి..

ఈ సంఘటన జాతీయరహదారి 39 పై అస్సాం లోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సుశాంత నంద ”ఆ ఏనుగు డ్రైవర్ కు ఒక పాఠం నేర్పించాలని అనుకున్నట్టు ఉంది. తన మానాన తాను పోతుంటే హరన్ కొట్టి విసిగించినందుకు.. అందుకే ఎప్పుడూ వన్య ప్రాణుల్ని విసిగించకూడదు.

Also Read: Viral Video: ఇద్దరు భామల ముద్దుల మొగుడు నెట్టింట్లో హల్ చల్… ( వీడియో )

Viral Video: ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా…!! ( వీడియో )