ఆఫ్రికాలో పుట్టింది.. కోనసీమలో కనువిందు చేస్తోంది !!

|

Apr 03, 2023 | 8:53 PM

మనకు ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలే తెలుసు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఒక రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్‌ అనిపించుకుంటున్నాడు.

మనకు ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలే తెలుసు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఒక రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్‌ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలను ప్రజలకు తినేందుకు అలవాటు చేసి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు. మలికిపురం మండలం కేశనపళ్లి గ్రామానికి చెందిన దొమ్మైటి శ్రీనివాసరావు అనే రైతు వినూత్న ఆలోచనలతో సిరుల పంట పండుతోంది. తొలిసారిగా పసుపురంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పండిస్తున్నాడు. మునుపెన్నడూ కోనసీమలో పండించని ఆర్గానిక్ పసుపు రంగు పుచ్చ కాయలు పండిచడంతో స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది. తొలుత తాను పండించే పుచ్చకాయలు ఎరుపుగా లేకపోవడంతో తినేందుకు జనం విముఖత చూపారు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలను వివరించడంతో గిరాకీ బాగా పెరిగింది. జనం ప్రజలు పసుపు పుచ్చకాయలను తినడం మొదలుపెట్టడంతో ఇప్పుడు శ్రీనివాసరావు మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!

Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్‌ అందుకున్న బలగం

అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్‌ భర్త ఖేల్ ఖతం !!

Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!

Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??

Follow us on