ఎంజాయ్ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు
ఇటీవల కాలంలో ఏచిన్న ఈవెంట్‌లోనైనా డాన్స్ కామన్ అయిపోయింది. సందర్భం ఏదైనా చిన్న, పెద్ద తేడా లేకుండా డీజేల మోతలతో, అదిరిపోయే డాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఏచిన్న ఈవెంట్‌లోనైనా డాన్స్ కామన్ అయిపోయింది. సందర్భం ఏదైనా చిన్న, పెద్ద తేడా లేకుండా డీజేల మోతలతో, అదిరిపోయే డాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో 60 ఏళ్ల బామ్మ డాన్స్ చేసిన వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఉన్న సింగర్స్ పాటపాడుతుంటే అక్కడున్న వారంతా డ్యాన్స్ చేశారు. వారిలో అందరి కంటే ముందు వరుసలో నిల్చున్న ఓ బామ్మ.. ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది. మరాఠీ పాటకు అద్భుత స్టెప్పులతో అదరహో అనిపించింది. 60 ఏళ్ల పైనే వయసున్న బామ్మ.. పరిసరాలను మరిచి, పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీసింది. బామ్మ స్టామినా చూసి నెటిజన్లు అవాక్కువుతున్నారు. ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి ఫిదా అవుతున్నారు. బామ్మకి బాల్యం గుర్తొచ్చినట్టుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

