వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా

Updated on: Dec 16, 2025 | 5:54 PM

సాధారణంగా ఒక పొత్తు ఇచ్చే మొక్కజొన్న 16 కంకులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం పి.ఎల్.కొత్తూరు రైతు నాగేశ్వరరావు పొలంలో హైబ్రిడ్ విత్తనాలతో ఒకే మొక్కకు ఈ అద్భుతం సాధ్యమైంది. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం, హైబ్రిడ్ విత్తనాలు, భూసారం ఇలాంటి అధిక దిగుబడికి కారణం. ఈ వింత మొక్కజొన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సాధారణంగా మొక్కజొన్నకు ఒకచోట ఒక పొత్తు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో రెండు మూడు పొత్తులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఒకే మొక్క జొన్న మొక్కకు పదుల సంఖ్యలో పొత్తులు రావడం ఎప్పుడైనా చూశారా? అదేమరి విచిత్రమంటే.. పదుల సంఖ్యలో మొక్కజొన్న కంకులతో అటు రైతులను, ఇటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ మొక్క. అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం.. పి ఎల్ కొత్తూరులో నాగేశ్వరరావు అనే రైతు.. తన పొలంలో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు తెచ్చి వేశాడు. వాటిలో ఓ చెట్టుకు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 పొత్తులు వచ్చాయి. అది చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన విత్తు నుంచి వచ్చిన మొక్కకు ఇలా ఇన్ని పొత్తులు కాయడంతో చూసి ఆశ్చర్యంతోపాటు సంబరపడిపోయాడు. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకడంతో.. ఈ మొక్కజొన్న పొత్తును చూసేందుకు చుట్టుపక్కలవారంతా అతని పొలానికి క్యూ కట్టారు. అయితే కొన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలతో పాటు భూసారాన్ని బట్టి ఇలా మొక్కలకు వచ్చే పొత్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇదిలా ఉండగా ఈ విచిత్ర మొక్క జోన్నకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నో డిలే.. నో డైవర్షన్‌.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??

బరువు తగ్గించే ఇంజెక్షన్‌ ఇండియాకి వచ్చేసిందోచ్‌..

కొబ్బరి బొండాం పీచును నోటితో వొలిచి.. సత్తా చాటిన మహిళ

Jailer 2: విద్యాబాలన్ రీ-ఎంట్రీ.. పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్న ముద్దుగుమ్మ