Viral: ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

|

May 10, 2024 | 6:16 PM

ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడంలేదు. అడవినే నమ్ముకుని బ్రతికే వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలంటూ రహదారి ఉండదు. సమీపంలో వైద్య సదుపాయం ఉండదు.. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు, వంకలూ దాటాలి. లేదా డోలీకట్టుకొని వెళ్లాలి. ఈ సందర్భంలో ఒక్కోసారి ఎందరో గర్భిణిలు అడవిలోనే ప్రసవించిన సందర్భాలు ఉన్నాయి.

ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడంలేదు. అడవినే నమ్ముకుని బ్రతికే వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలంటూ రహదారి ఉండదు. సమీపంలో వైద్య సదుపాయం ఉండదు.. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు, వంకలూ దాటాలి. లేదా డోలీకట్టుకొని వెళ్లాలి. ఈ సందర్భంలో ఒక్కోసారి ఎందరో గర్భిణిలు అడవిలోనే ప్రసవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అల్లూరి జిల్లాలోని గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు. అనంతగిరి మండలం మద్రేబు గ్రామం గిరిజనులు అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ తమ నిరసనను తెలిపారు. ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేసామని లెక్కలు చూపిస్తున్నారు కానీ, అభివృద్ధి పనులు మాత్రం వాస్తవంలో కనిపించడంలేదని ఆరోపించారు.

రోడ్డు సౌకర్యం లేక తాము ఎన్నో అవస్థలు పడుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీలు, నేతలు సన్నద్ధమవుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా గిరిజనులు నిరసనకు దిగారు. తాము ఓటు వెయ్యాలంటే రోడ్లు వెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఓటువేసేందుకు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు గుర్రాలపై వెళ్లాల్సి వస్తోందని ఒక్కొక్కరికి రూ.500లు ఖర్చవుతోందని, ఏ ప్రభుత్వాలూ తమను పట్టించుకోవడంలేదని నిరసనకు దిగారు. నెత్తిమీద అడ్డాకులు పెట్టుకుని గుర్రాలపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on