అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా

అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా

Phani CH

|

Updated on: Jul 01, 2024 | 8:31 PM

భార‌త అప‌ర‌కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. దీంతో అంబానీ కుటుంబం పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్రమంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీడియో చూస్తే.. అదిరింది అనకమానరు..

భార‌త అప‌ర‌కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. దీంతో అంబానీ కుటుంబం పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్రమంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీడియో చూస్తే.. అదిరింది అనకమానరు.. ఈ వెడ్డింగ్ కార్డ్ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివాహ ఆహ్వాన ప‌త్రికను ఒక ప్రత్యేక పెట్టె రూపంలో తీర్చిదిద్దారు. దీనికి లైట్లు, ఎరుపు రంగుతో అలంకరించారు. ఇక బాక్స్ ఓపెన్ చేయ‌గానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన ఆల‌యం క‌నిపిస్తుంది. ఆ ఆలయం లోప‌ల వెండితోనే చేసిన‌ వినాయ‌కుడు, దుర్గామాత‌, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆహ్వాన ప‌త్రిక ఒక చ‌క్కటి కళాఖండాన్ని త‌ల‌పిస్తున్నట్టనిపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు

పగబట్టి.. వెంటాడి వేటాడిన చంపేసిన శునకం !! అమెరికాలో అరుదైన ఘటన

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా ??

భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ

వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు