క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ క్యాసినోకు రెగ్యులర్‌గా వెళ్లే ఓ వ్యక్తికి దశ మారిపోయే.. కలలో కూడా ఊహించని జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.33.76 కోట్ల విలువైన జాక్‌పాట్ అతడిని వరించింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అతడు ఎగిరి గంతేశాడు. జీవితాన్ని మలుపు తిప్పే సందర్భాన్ని సందడిగా వేడుక చేసుకున్న సమయంలో గుండెపోటు వచ్చింది. సెలబ్రేషన్స్ మధ్యలోనే అతడు కుప్పకూలాడు.

క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు

|

Updated on: Jul 01, 2024 | 8:30 PM

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ క్యాసినోకు రెగ్యులర్‌గా వెళ్లే ఓ వ్యక్తికి దశ మారిపోయే.. కలలో కూడా ఊహించని జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.33.76 కోట్ల విలువైన జాక్‌పాట్ అతడిని వరించింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అతడు ఎగిరి గంతేశాడు. జీవితాన్ని మలుపు తిప్పే సందర్భాన్ని సందడిగా వేడుక చేసుకున్న సమయంలో గుండెపోటు వచ్చింది. సెలబ్రేషన్స్ మధ్యలోనే అతడు కుప్పకూలాడు. సింగపూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూన్ 22న తను రెగ్యులర్‌గా వెళ్లే క్యాసినోలో ఆనందంతో ఎగిరి గంతేస్తున్న అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అప్పటివరకు సందడిగా ఉన్న క్యాసినో ఒక్కసారిగా సైలెంట్ అయింది. సదరు వ్యక్తి పక్కన ఉన్న మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. క్యాసినో సిబ్బంది తక్షణమే సాయం అందించడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దీంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పగబట్టి.. వెంటాడి వేటాడిన చంపేసిన శునకం !! అమెరికాలో అరుదైన ఘటన

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా ??

భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ

వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు

రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

Follow us