యువకుల ఐడియాకు ఆనంద్ మహీంద్రా షాక్ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన
ఉపాయం లేనోడిని ఊళ్లోంచి తరిమేయాలని నానుడి. అవును మరి ఉపాయం ఉంటే అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు. సరిగ్గా అదే చేశారు నవీ ముంబైకి చెందిన కొందరు యువకులు.
ఉపాయం లేనోడిని ఊళ్లోంచి తరిమేయాలని నానుడి. అవును మరి ఉపాయం ఉంటే అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు. సరిగ్గా అదే చేశారు నవీ ముంబైకి చెందిన కొందరు యువకులు. పట్టణాల్లో ఆటలాడుకోడానికి ప్లేగ్రౌండ్స్ వుండవు. ఒకవేళ ఉన్నా చాలా దూరంగా ఉంటాయి. అందుకే ఈ యువకులు ఫ్లైఓవర్ వంతెన కింద ఖాళీ స్థలాన్ని ప్లే గ్రౌండ్‌గా మలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ధనుంజయ్ అనే యువకుడు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఇది అద్భుతమైన ఆలోచన.. నవీ ముంబైలో ఫ్లై ఓవర్ల కింద ప్లే గ్రౌండ్స్ నిర్మించినట్లు అన్ని నగరాల్లోని ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ‘ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ ఐడియాపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!
ఎంజాయ్ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం

