Murder: షాపులో దాక్కున్నా మరీ.. కత్తులతో వేటాడి, విచక్షణా రహితంగా నరికిన దుండగులు..(వీడియో)

|

Oct 26, 2022 | 8:49 AM

గుంటూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి, వెంటాడి కత్తులతో దాడి చేసి, హత్య చేశారు. లాలాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏటుకూరు సెంటర్‌లోని ఓ దుకాణం ముందు నిల్చుని ఉన్న రమేశ్‌ అనే వ్యక్తిపై..


గుంటూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి, వెంటాడి కత్తులతో దాడి చేసి, హత్య చేశారు. లాలాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏటుకూరు సెంటర్‌లోని ఓ దుకాణం ముందు నిల్చుని ఉన్న రమేశ్‌ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రాణరక్షణ కోసం దుకాణంలోకి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించగా వెంటాడి మరీ చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రమేశ్.. ఫైనాన్స్‌ వ్యాపారంతో పాటు శుభకార్యాలకు డెకరేషన్‌ పనులు చేస్తుంటాడు. సమాచారం అందుకున్న గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమేశ్‌ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన సంఘటనకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నారని, స్నానానికి నీళ్లు పెట్టేలోగా ఎవరో ఫోన్‌ చేసి పిలవగా బయటకు వచ్చి హత్యకు గురయ్యారని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. కాగా.. రమేష్‌పై గుంటూరు లాలాపేట స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. గతంలో పాతగుంటూరులోని చాకలికుంట వద్ద జరిగిన ఓ హత్య కేసులో ఇతను నిందితుడు అని పోలీసులు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 26, 2022 08:49 AM