Viral Video: ఆమె ఐడియా.. జీవితాన్నే మార్చేసింది..! పిల్లల కోసం వినూత్న ప్రయోగం.. చివరికి సక్సెస్..(వీడియో)

Viral Video: ఆమె ఐడియా.. జీవితాన్నే మార్చేసింది..! పిల్లల కోసం వినూత్న ప్రయోగం.. చివరికి సక్సెస్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 08, 2022 | 9:14 AM

పిల్లలకు ఆహారం తినిపించడం తల్లులకు పెద్ద సవాలే.. అలాంటి సవాలునుంచి ఒక తల్లికి పుట్టిన ఆలోచన ఆమె జీవితాన్నే మార్చేసింది. పిల్లలకు ఏది పెట్టినా వెంటనే తినరు. అది కావాలి, ఇది కావాలి అని మారాం చేస్తారు. ఒక్కోసారి వాళ్లు అడిగింది పెట్టినా తినరు. బతిమలాడీ ఆడీ..


పిల్లలకు ఆహారం తినిపించడం తల్లులకు పెద్ద సవాలే.. అలాంటి సవాలునుంచి ఒక తల్లికి పుట్టిన ఆలోచన ఆమె జీవితాన్నే మార్చేసింది. పిల్లలకు ఏది పెట్టినా వెంటనే తినరు. అది కావాలి, ఇది కావాలి అని మారాం చేస్తారు. ఒక్కోసారి వాళ్లు అడిగింది పెట్టినా తినరు. బతిమలాడీ ఆడీ.. తల్లులకు కోపం కూడా వస్తుంది. అయినా సరే సహనంతో తినిపిస్తారు. ఏదో ఒకటి చేసి ఫుడ్ తినేలా చేస్తారు. అది తల్లుల గొప్పదనం. ఇదే విధంగా జపాన్ కి చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఎటోనీ… తన పిల్లలు మూడు పూటలా చక్కగా తినేందుకు ఓ క్రియేటివ్ ప్లాన్ వేసింది. అదే ఫుడ్ ఆర్ట్.రోజూ ఫుడ్ ఒకేలా పెడితే పిల్లలు తినరు అని భావించిన ఆమె… ఆహారాన్నే రోజుకో బొమ్మ లాగా వేసి ఇచ్చేది. ఆమె ఐడియా ఫలించి పిల్లలు చక్కగా ఆహారం తినడం మొదలు పెట్టారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్… ప్రతీదీ ప్రత్యేక బొమ్మల ఆకారంలో డెకరేట్ చేసి ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో పిల్లలు ప్లేట్ లో ఏదీ మిగలకుండా తినేస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు, స్కూల్లో ఇతర పిల్లల పేరెంట్స్ కీ, టీచర్లకూ తెలిసింది. తమ పిల్లలకు కూడా అలా చేసి పెట్టమని వారంతా కోరారు. అందుకు డబ్బులు చెల్లిస్తామని వారు చెప్పారు. అలా ఆమె ఫుడ్ ఆర్ట్ బిజినెస్ ప్రారంభమైంది. రోజురోజుకూ దాన్ని అభివృద్ది చేస్తూ ఇప్పుడు ఈ వ్యాపారంలో ఆమె దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. జపాన్ లో ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సైతం… ఆమెకు ఆర్డర్ ఇచ్చి… బొమ్మల ఫుడ్ తెప్పించుకుంటున్నారు. తన వ్యాపారాన్ని మరింత పెంచుతూ ఇప్పుడు ఆమె కేక్స్, బిస్కెట్స్, కుకీస్, బ్రెడ్స్ ఇలా రకరాకాల ఫుడ్‌ బొమ్మల ఆకారంలో చేస్తోంది. అలాగే పార్టీలు, వేడుకలకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవారికి కూడా ఆమె స్వయంగా వెళ్లి డెకరేట్ చేస్తోంది. ప్రతీదీ ఎంతో అందంగా తయారుచేసే ఆమెకు జపాన్ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.