Bumper offer: కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్..!
ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్దతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్స్‌ను అందించనుంది. అంతేకాకుండా ముందుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు
ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్దతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్స్‌ను అందించనుంది. అంతేకాకుండా ముందుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన పది వేల మంది ఉద్యోగులకు 5వేల చొప్పున ఇన్సెంటీవ్‌గా అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అదనంగా మరో 2వేల రూపాయలు ప్రోత్సాహక నగదును అందిస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ఇదంతా కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాల్లో భాగమని తెలుస్తోంది.ఎప్పటి నుంచో దేశరాజధాని కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతోంది. కాలుష్యం కారణంగా సరి బేసి సంఖ్య విధానం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు. ఇక కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టింది ఢిల్లీ సర్కార్. అయినా తగిన స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. కాగా ఢిల్లీలో కాలుష్యం కారణంగా అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. నవంబర్-డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని నాసా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..