Amrithpal Singh:  ఓర్నీ.. నీ వేషాలో.. గొడుగు అడ్డుపెట్టుకొని పారిపోతున్న అమృత్ పాల్ సింగ్.

Amrithpal Singh: ఓర్నీ.. నీ వేషాలో.. గొడుగు అడ్డుపెట్టుకొని పారిపోతున్న అమృత్ పాల్ సింగ్.

Anil kumar poka

|

Updated on: Mar 30, 2023 | 9:53 AM

అమృత్‌పాల్‌సింగ్‌, ఈ పేరు ఇప్పుడు దేశంలో మారుమోగిపోతోంది. ఏడ్రోజులుగా పంజాబ్‌ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు అమృత్‌పాల్‌. ఒకే ఒక్కడ్ని పట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది పంజాబ్‌ పోలీస్‌.

అమృత్‌పాల్‌సింగ్‌, ఈ పేరు ఇప్పుడు దేశంలో మారుమోగిపోతోంది. ఏడ్రోజులుగా పంజాబ్‌ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు అమృత్‌పాల్‌. ఒకే ఒక్కడ్ని పట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది పంజాబ్‌ పోలీస్‌. అయితే మార్చి 19 నుంచి 21వరకు అమృత్‌పాల్‌ ఆశ్రయం పొందిన ప్రాంతాలను పోలీసులు కనుక్కోగల్గారు. హర్యానా కురుక్షేత్రలో ఓ మహిళ… అతనికి షెల్టర్‌ ఇచ్చినట్టు గుర్తించి ఆమెను అరెస్ట్‌ చేశారు. అమృత్‌పాల్‌ బాడీగార్డ్స్‌ తేజిందర్‌ సింగ్‌, గోర్కా బాబాను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌పాల్‌కు సహకరించిన ప్రతి ఒక్కర్నీ అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు… అతని భార్య కిరణ్‌దీప్‌కౌర్‌, ఆమె కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టారు.అమృత్‌పాల్‌ పంజాబ్‌ నుంచి హర్యానాలోకి ఎంటరైనట్లు గుర్తించారు పోలీసులు. ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు… అమృత్‌పాల్‌ మార్చిన వేషాలు, ప్రయాణించిన కార్లు, బైక్ల ఫొటోలు, వీడియోలను రిలీజ్‌ చేశారు. అమృత్‌పాల్‌ తన ముఖం కనిపించకుండా గొడుగు అడ్డంపెట్టుకుని పారిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమృత్‌పాల్‌ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేసింది కేంద్రం. మెయిన్‌గా నేపాల్‌ సరిహద్దుల్లో నిఘా పెంచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Mar 30, 2023 09:53 AM