Lion – Man: దమ్మున్నోడు.. సింహం ముందు సింగిల్‌గా.. అతన్ని చూసి తోక ముడిచిన సింహం.
ప్రకృతి అందాలాను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్న మీ వాహనానికి ఎదురుగా ఓ సింహం వచ్చి నిలుచుంది అనుకోండి.. ఊహించడానికే భయంగా ఉంది కదూ..
మీరు బైక్ పైనో, కారులోనో అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నారు. ప్రకృతి అందాలాను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్న మీ వాహనానికి ఎదురుగా ఓ సింహం వచ్చి నిలుచుంది అనుకోండి… ఊహించడానికే భయంగా ఉంది కదూ.. ఎందుకంటే సింహం అంటేనే క్రూర మృగం. అది ఆకలితో ఉందంటే మరీ డేంజర్… ఆ సమయంలో దాని కంటపడిన ఎవరైనా తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి సింహం ముందు ఏమాత్రం భయం లేకుండా నిల్చున్నాడు ఓ వ్యక్తి. అప్పుడు ఆ సింహం ఏంచేసిందో తెలుసా.. కొందరు వ్యక్తులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఓ వ్యక్తి ప్రకృతిని దగ్గరగా చూడాలనే కుతూహలంతో వాహనం ముందు భాగంలో కూర్చుని వెళ్తున్నాడు. ఇంతలో సఫారీ వెనుక నుంచి ఓ సింహం వచ్చింది. నేరుగా ఆ వాహనం ముందు కూర్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్లింది. ఊహించని ఆ పరిణామానికి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. అతను ఏమాత్రం కదిలినా సింహం రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడిన అతను కదలకుండా తనముందున్న సింహాన్ని చూస్తూ ఉండిపోయాడు. సింహం కూడా అతన్ని “ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. బీ కేర్‌ఫుల్’ అన్నట్టు ఓ సీరియస్ లుక్ ఇచ్చి.. అక్కడ్నుంచి ముందుకు వెళ్లిపోయింది. దీంతో, వాహనంలోవారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లేటెస్ట్ క్రూగర్ అనే యూజర్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

