Viral: బురదలో దిగబడిపోయిన అంబులెన్స్.! బిడ్డను కోల్పోయిన గర్భిణి..

Viral: బురదలో దిగబడిపోయిన అంబులెన్స్.! బిడ్డను కోల్పోయిన గర్భిణి..

Anil kumar poka

|

Updated on: Dec 10, 2023 | 9:53 AM

మిచౌంగ్‌ తుఫాను ఊళ్లకు ఊళ్లనే ముంచేసింది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. తెలంగాణపైనా తన ప్రభావాన్ని చూపింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు జలమయం అయ్యాయి. వాన తగ్గినా రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. దాంతో వాహనరాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక బిడ్డను కోల్పోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

మిచౌంగ్‌ తుఫాను ఊళ్లకు ఊళ్లనే ముంచేసింది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. తెలంగాణపైనా తన ప్రభావాన్ని చూపింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు జలమయం అయ్యాయి. వాన తగ్గినా రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. దాంతో వాహనరాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక బిడ్డను కోల్పోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు బుధవారం సాయంత్రం పురుటి నొప్పులు మొదలవటంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను పిలిపించారు. ఏటూరునాగారం నుంచి అంబులెన్స్‌ కోయగూడ ఎల్లపూర్‌కు బయల్దేరింది. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రాంనగర్‌ రహదారి ధ్వంసం అయిపోయింది. ఈ క్రమంలో అంబులెన్స్‌ కోయగూడ ఎల్లపూర్‌ గ్రామానికి కిలోమీటరు దూరంలోనే అది బురదలో కూరుకుపోయింది. ఎంతకీ కదలకపోవడంతో చేసేది లేక గ్రామస్థులు రమ్యను ట్రాక్టర్‌లో అక్కడి వరకు తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్‌ సాయంతో అబులెన్స్‌ను పైకిలాగారు. అనంతరం రమ్యను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో రమ్యకు సాధారణ డెలివరీ జరిగింది. కానీ అప్పటిగే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆస్పత్రికి చేరడం ఆలస్యం కావడంతో కడుపులోని శిశువు ఉమ్మనీరు మింగేయడంతో మృతి చెందింది. తమ గ్రామంలో రోడ్లు అధ్వాన్నంగా మారడంవల్లే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.