Viral Video: కారు చూస్తే అద్భుతం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్.. వైరల్ వీడియో..

దేశంలో ఇలాంటి తెలివైన ఆలోచన(Amazing Jugaad Video)తో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, ఎంతోమంది నెట్టింట్లో వైరలవుతున్నారు. ఇలాంటి వారికి దేశంలో కొరత లేదు.

Viral Video: కారు చూస్తే అద్భుతం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్.. వైరల్ వీడియో..
Jugaad Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Apr 19, 2022 | 4:38 PM

దేశీ జుగాడ్(Desi Jugaad)కి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేవలం విద్యావంతులు లేదా సాంకేతిక వ్యక్తులు మాత్రమే తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి ఆకట్టుకుంటారని అనుకుంటాం. కానీ, దేశంలో ఇలాంటి తెలివైన ఆలోచన(Amazing Jugaad Video)తో ఎంతోమంది నెట్టింట్లో వైరలవుతున్నారు. ఇలాంటి వారికి దేశంలో కొరత లేదు. ప్రస్తుతం, అలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన తెలివిని ఉపయోగించి ఎద్దుల బండిని విలాసవంతమైన కారుగా మార్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ (Viral Video)అవుతోంది.

నెటిజన్లు జుగాడ్‌తో చేసిన వస్తువులను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే, వీటిలో కొన్ని జుగాడ్‌లు చూసిన తర్వాత మనం ఆశ్చర్యపోతుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే ఒకటి కనిపిస్తోంది. వీడియో ప్రారంభంలో, కారులో మహిళలు ఒక్కొక్కరుగా కూర్చొని కనిపించడం మీరు చూడొచ్చు. ఈ మహిళలు దుస్తులు ధరించి ఉన్న తీరును బట్టి వారు లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నారని ఊహించవచ్చు. కానీ, మరుసటి క్షణంలో ఆ కారును చూస్తే మాత్రం, షాకవుతారంతే.

కారులో వెనుక సీటులో మహిళలు కూర్చున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో వీడియోలో చూడొచ్చు. కానీ, కెమెరా యాంగిల్ మారినప్పుడు, విలాసవంతమైన కారు ఎద్దుల బండిగా మారిపోవడం మీరు చూడొచ్చు. అయితే, ఈ దేశీ జుగాడ్ ఎవరు చేశారో కానీ, అతని తెలివికి ఓ సెల్యూట్ చేయాల్సిందేనని అనిపిస్తుంది. తక్కవు డబ్బులతో ఎండ్ల బండిని కారులా మార్చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ దేశీ జుగాడ్ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది లైక్ చేశారు. అదే సమయంలో, 34-సెకన్ల క్లిప్‌ను చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘దీనిని నిజమైన ఎద్దుల బండి అంటారు’ అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Also Read: Mukesh Ambani: అంబానీ@65.. ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

Viral Photo: కష్టం కాదు సంక్లిష్టం.. ఈ ఫోటోలో పిల్లిని కనిపెడితే మీరు తోపు ఎహే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!