Viral Photo: కష్టం కాదు సంక్లిష్టం.. ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టడం అంత సులువు కాదు గురు..!

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు.

Viral Photo: కష్టం కాదు సంక్లిష్టం.. ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టడం అంత సులువు కాదు గురు..!
Find The Cat
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Apr 20, 2022 | 7:54 AM

Picture Puzzle : ఏం తోచక..బోర్ కొట్టిందంటే చాలు.. అందరూ  సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. అక్కడ టైమ్ పాస్ చేయడానికి బోలెడు కంటెంట్ ఉంటుంది. మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్.  పజిల్స్ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎంత కష్టమైనా సరే.. టాస్కులు కంప్లీట్ చేయాలని కొంతమంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాంటివారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. అందుకే ఎలాంటి పజిల్ కనబడినా.. దాని లెక్క తేల్చే వరకు అస్సలు వదిలిపెట్టారు. ఈ తరహా పజిల్స్ మీ కళ్లలో ఎంత పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఈ ఫోటో పజిల్స్‌ను కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా అందిస్తున్నాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని సులభంగా ఉన్నా, మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. తెగ తికమక పెడుతూ మనతో ఒక ఆట ఆడుకుంటాయ్.  ఇవి చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి. కాగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేస్తే ఓ కిక్ వస్తుంది. తాజాగా ఓ పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం అడవిలో తీసినదిగా కనిపిస్తుంది. అందులో ఓ పిల్లి దాగుంది. అక్కడున్న చెట్టు కొమ్మల మధ్యలో అది ఉంది. దీన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. 100కు 90 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేస్తే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దిగువ ఫోటోను చూసేయ్యండి. అక్కడ మీకు పిల్లి ఎక్కడ ఉందో క్లియర్‌గా రౌండ్ చేసి ఇచ్చాము.

వెంటనే సమాధానాన్ని కనుగొనడానికి స్క్రోల్ చేయవద్దు …. జాగ్రత్తగా శోధించండి.. ఇక కష్టం అనుకుంటేనే దిగువకు వెళ్లండి . . . ? . . . .

? . . . . ?

Cat

Also Read: Andhra Pradesh: వామ్మో..! ఈ కొండ చిలువ చూశారా.. రొడ్డంత పొడవు ఉంది..