Delhi: మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించిన ఏఐ.! ఏఐ ఇలా కూడా సాయపడుతుంది.

Delhi: మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించిన ఏఐ.! ఏఐ ఇలా కూడా సాయపడుతుంది.

Anil kumar poka

|

Updated on: Jan 29, 2024 | 11:48 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఢిల్లీ పోలీసులు హత్య కేసును చేధించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు, హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించింది. ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతుని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోను తీయడంలో విజయం సాధించారు. జనవరి 10న గీతా కాలనీ ఫ్లై ఓవర్ కింద ఓ యువకుని మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదికలో..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఢిల్లీ పోలీసులు హత్య కేసును చేధించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు, హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించింది. ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతుని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోను తీయడంలో విజయం సాధించారు. జనవరి 10న గీతా కాలనీ ఫ్లై ఓవర్ కింద ఓ యువకుని మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదికలో.. గొంతు నులిమి ఆ యువకుడిని హత్య చేసినట్లు వెల్లడయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదు. దీంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. కొద్దిపాటి కసరత్తు తర్వాత మృతునికి సంబంధించిన స్పష్టమైన ఫొటో వెలికివచ్చింది. కళ్లు తెరచి ఉన్నప్పుడు మృతుని ముఖం ఎలా ఉంటుందనేది గుర్తిస్తూ, ఫొటో రూపొందించారు. దీనితో పోస్టర్లు వేయించిన పోలీసులు వాటిని వేర్వేరు ప్రాంతాల్లోని గోడలపై అతికించారు. అలాగే వాట్సాప్‌ గ్రూపులలో షేర్‌ చేశారు.

దీంతో పోలీసుల కృషి ఫలించింది. ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఒక కాల్‌లో.. ఆ మృతదేహం తన అన్నయ్య హితేంద్ర ఫోటోనేనని ఒక వ్యక్తి తెలిపాడు. ఈ నేపధ్యంలో పోలీసులు హితేంద్ర ప్రొఫైల్‌ను పరిశీలించారు. అతని సన్నిహితులను విచారించి, కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో హితేంద్ర.. ముగ్గురు యువకులతో ఏదో విషయమై గొడవ పడ్డాడని, వారు హితేంద్ర గొంతుకోసి ఆ మృతదేహాన్ని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద పారేశారని తేలింది. ఆధారాలు దాచిపెట్టడంలో ఓ మహిళ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులతో పాటు ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos