Nasa ingenuity: ముగిసిన నాసా ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ ప్రస్థానం.! దెబ్బతిన్న బ్లేడ్‌లు, ఎగిరే స్థితిలో లేని రోవర్‌.

Nasa ingenuity: ముగిసిన నాసా ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ ప్రస్థానం.! దెబ్బతిన్న బ్లేడ్‌లు, ఎగిరే స్థితిలో లేని రోవర్‌.

Anil kumar poka

|

Updated on: Jan 29, 2024 | 11:57 AM

అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్‌ ‘ఇంజెన్యూటీ’ ప్రయాణం ఇక ముగిసింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది. తాజాగా ఆ హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేస్తుండగా.. దాని రోటార్లు దెబ్బతిన్నాయి. దీనిపై నాసాకు చెందిన బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ.. ఆ బుల్లి ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ అంచనాలకు మించి పనిచేసిందన్నారు.

అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్‌ ‘ఇంజెన్యూటీ’ ప్రయాణం ఇక ముగిసింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది. తాజాగా ఆ హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేస్తుండగా.. దాని రోటార్లు దెబ్బతిన్నాయి. దీనిపై నాసాకు చెందిన బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ.. ఆ బుల్లి ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ అంచనాలకు మించి పనిచేసిందన్నారు. మన సౌర వ్యవస్థలో ఎగరడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసిందని అభివర్ణించారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో మానవులు చేపట్టే ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఇంజెన్యూటీ సాధారణ స్థితిలో నిలబడి ఉన్నా.. బ్లేడ్‌లు దెబ్బతిన్నాయన్నారు. దానితోపాటు ఉన్న గ్రౌండ్‌ వెహికల్ పంపిన ఫొటోల్లో ఇది కనిపించిందని పేర్కొన్నారు. అది ఇక ఎగిరే స్థితిలో లేదని బిల్‌ వెల్లడించారు.

మరోవైపు నాసా స్పందిస్తూ.. అక్కడి పరిస్థితులను విశ్లేషిస్తున్నామని తెలిపింది. ఇంజెన్యూటీని 2021లో నాసా ప్రయోగించింది. పర్సెవరన్స్‌ అనే రోవర్‌ గర్భంలో దీనిని ఉంచి అక్కడికి చేర్చింది. భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ.. అందుకే ల్యాండింగ్‌తో పాటు, పైకి ఎగరడం కూడా కఠినమైన ప్రక్రియే. దీని ద్వారా అంగారక గ్రహంపై కీలక సమాచారం సేకరించే అవకాశం లభించింది. గతేడాది ఏప్రిల్‌ నాటికి 50 ప్రయాణాలను పూర్తి చేసింది. అప్పట్లో అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది. అయినా.. ఇంజెన్యూటీ తన పని కొనసాగించింది. దీని భాగాలను చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్లు, కెమెరాల వంటి వాటితోనే రూపొందించటం విశేషం. భవిష్యత్తులో అంగారకుడిపై ఎగిరే హెలికాప్టర్ల తయారీకి ఇది అందిస్తున్న సమాచారం ఉపయోగపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos