Viral: కోట్ల ఆస్తిని, వ్యాపారాలను వదిలి సన్యాసాగా మారి.. భిక్షాటన చేస్తూన్న అభినవ యువకుడు.
శ్రీలంకలో తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ అనే వ్యక్తి వేల కోట్ల వ్యాపారాలకు అధిపతి. మలేషియాలో అత్యంత సంపన్నులలో మూడో వ్యక్తి ఇతను. అందరిలాగే ఆనంద్ కృష్ణన్ తన ఆస్తులు, వ్యాపారాలన్నీ తన కుమారుడైన అజన్‌కు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యానికి కుమారుడ్ని అధిపతిని చేయాలనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టుగా...
సాధారణంగా ఎంత ఆస్తి ఉన్నా, దానిని ఇంకా వివిధ వ్యాపారాల్లో పెట్టి దానిని మరింత పెంచుకోవాలనే అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఓ యువకుడు కోట్ల ఆస్తిని, వ్యాపారాలను వదిలి సన్యాసిగా మారి భిక్షాటన చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాచరికాన్నీ, విలాసాల్నీ కాదనుకుని సన్యాసిగా మారిన గౌతమ బుద్ధుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనలాగే ఈ యువకుడు కూడా వేల కోట్ల ఆస్తుల్ని వదులుకుని సేవ చేయడానికి సన్యాసిగా మారాడు. శ్రీలంకలో తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ అనే వ్యక్తి వేల కోట్ల వ్యాపారాలకు అధిపతి. మలేషియాలో అత్యంత సంపన్నులలో మూడో వ్యక్తి ఇతను. అందరిలాగే ఆనంద్ కృష్ణన్ తన ఆస్తులు, వ్యాపారాలన్నీ తన కుమారుడైన అజన్‌కు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యానికి కుమారుడ్ని అధిపతిని చేయాలనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టుగా అతని కుమారుడు ఆస్తులు, బంధాలు ఏవీ తనకొద్దని సన్యాసిగా మారిపోయాడు. గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ భవబంధాలన్నీ వదిలి సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అజన్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఓ మఠాధిపతిగా ఉన్నాడు. తమిళంతోపాటు మరో తొమ్మిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఇతను ఇంటి ముఖం చూసి ఇరవై ఏళ్లు అయింది. విలాసవంతమైన జీవితాన్ని కాదని, సన్యాసిగా మారిన అజన్‌ను అందరూ అభినవ బుద్ధుడు అంటుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...