Mobile Tea Stall: ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయిన ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

|

Feb 10, 2024 | 5:23 PM

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసీ..చేసీ... చివరకు నిరాశే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునేవారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారింది. అందుకు ఉదాహరణ ఈ ఖమ్మం జిల్లా యువకుడు. ఉద్యోగం రాలేదని నిరాశ పడకుండా తనకాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేశాడు. తనలాంటి ఎందరికో స్పూర్తిగా నిలిచాడు. ఖమ్మంజిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లకు చెందిన సందీప్‌ అనే యువకుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు.

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసీ.. చేసీ.. చివరకు నిరాశే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునేవారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారింది. అందుకు ఉదాహరణ ఈ ఖమ్మం జిల్లా యువకుడు. ఉద్యోగం రాలేదని నిరాశ పడకుండా తనకాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేశాడు. తనలాంటి ఎందరికో స్పూర్తిగా నిలిచాడు. ఖమ్మంజిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లకు చెందిన సందీప్‌ అనే యువకుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో ఆ ప్రయత్నాలకు స్వస్తి చెప్పాడు. వ్యాపారం దిశగా ఆలోచించాడు. ఏదైనా కొత్తగా..త్వరగా క్లిక్‌ అయ్యేలా చెయ్యాలనుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మొబైల్‌ టీస్టాల్ ఐడియా వచ్చింది. వెంటనే ఓ ట్రాలీ ఆటోను టీస్టాల్‌గా మార్చుకున్నాడు. టీ స్టాల్‌ కూడా అందరినీ ఆకట్టుకేనేలా టీ కప్పు ఆకారంలో తయారు చేయించాడు. దానికి హెలో చాయ్‌.. నామకరంణం చేశాడు. అందుకు అతనికి దాదాపు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టినట్టు చెప్పాడు. ఇదే ఎందుకు అంటే మొబైల్‌ టీ స్టాల్‌ వల్ల ఎక్కడ వ్యాపారం బావుంటే అక్కడికి వెళ్లి చేసుకోవచ్చని తద్వారా నష్టపోయే అవకాశం ఉండదని తెలిపాడు. ప్రస్తుతం తన వ్యాపారం బావుందని, యువత ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా ప్రత్యామ్నాల దిశగా అడుగులు వేయడం మంచిదని సూచించాడు. అలాంటివారిని అందరూ ప్రోత్సహించాలని కోరాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..