AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన రోజే భర్త వేరే అమ్మాయిని కౌగిలించుకుంటే.. పెళ్లి కూతురు రియాక్షన్‌ వైరల్‌.. చివర్లో అసలు ట్విస్ట్‌..

Viral Video: ఏ భార్య అయినా తన భర్త కేవలం తనకు మాత్రమే సొంతమనే భావనలో ఉంటుంది. పక్కవారి చూపు పడినా మాటలతో యుద్ధం చేస్తుంది. అలాంటి ఏకంగా తనముందే తన భర్తను కౌగిలించుకుంటే..

పెళ్లైన రోజే భర్త వేరే అమ్మాయిని కౌగిలించుకుంటే.. పెళ్లి కూతురు రియాక్షన్‌ వైరల్‌.. చివర్లో అసలు ట్విస్ట్‌..
Narender Vaitla
|

Updated on: Jan 07, 2022 | 7:59 PM

Share

Viral Video: ఏ భార్య అయినా తన భర్త కేవలం తనకు మాత్రమే సొంతమనే భావనలో ఉంటుంది. పక్కవారి చూపు పడినా మాటలతో యుద్ధం చేస్తుంది. అలాంటి ఏకంగా తనముందే తన భర్తను కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది. అందులోనూ పెళ్లైన తొలిరోజే, పెళ్లి వేదికపైనే ఇలా జరిగితే.. తీవ్రంగా మనస్థాపం చెందుతుంది కదూ.! తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే చివర్లో ఆసక్తికర ట్విస్ట్‌ ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. వివాహం పూర్తి అయిన తర్వాత వధూవరులు ఇద్దరు స్టేజ్‌పై నిల్చున్నారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరూ స్టేజ్‌పైకి వస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో బురఖా ధరించిన ఓ మహిళ కూడా స్టేజ్‌పైకి ఎక్కింది. ముందుగా పెళ్లి కూతురికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి. ఆ తర్వాత వరుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. అయితే అంతటితో ఆగకుండా అతణ్ని గట్టిగా హత్తుకుంది. ఎంతకీ వదలకుండా అలాగే వాటేసుకుంది. దీంతో పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ అమ్మాయి తల పక్కకు తిప్పుకొని ధీనంగా మొహం పెట్టింది.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ జరిగింది. వరుడిని కౌగిలించుకున్న ఆ మహిళా.. నెమ్మదిగా బురఖాను తొలిగించింది. అప్పుడు కానీ తెలియదు ఆ వ్యక్తి మహిళ కాదని.. అబ్బాయి అని. వరుడి స్నేహితుడు అతడిని ఆటపట్టించడానికి అలా బురఖా రూపంలో వచ్చాడన్నమాట. ఈ సంఘటన చూసిన కొత్త పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కి గురైంది. పెళ్లికి హాజరైన వారంతా నవ్వడంతో పెళ్లి వేదిక సందడిగా మారింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్నేహితుల వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Also Read: చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో

Hyderabad: ముంబయి డ్రగ్స్‌ ముఠాల గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు.. పలువురు అరెస్ట్‌.. భారీ మొత్తంలో మత్తు పదార్థాల స్వాధీనం..

West Bengal: కోల్‌కతాలో మమతా బెనర్జీతో కలసి కెన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ