Viral Video: ఈ భూమ్మీద ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. తమ అసమాన ట్యాలెంట్‌తో ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటుంటారు. అయితే సరైన ఫ్లాట్‌ఫామ్ లభించక చాలా మంది ట్యాలెంట్ ప్రపంచానికి తెలియకుండానే కనుమరుగవుతుంది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి ప్రతిభ ప్రపంచానికి తెలిసిపోతోంది. ఓ చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో వీడియో వైరల్‌గా మారిపోతుంది. ఇలా ఈ వైరల్ వీడియోల ద్వారా ఎంతో మంది తమ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి తన అద్భుత ట్యాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ఆర్చరీ గేమ్‌ను ఆడుతోంది. అయితే సహజంగా ఆర్చరీ అంటే చేతిలో విల్లును పట్టుకొని గురి చూసి బాణాన్ని కొట్టడమనే మనకు తెలుసు. అయితే ఆ యువతి మాత్రం బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టాండ్‌పై రెండు చేతులు ఆనించి.. కాళ్లతో విల్లును పట్టుకొని గురి చూసి కొట్టింది. అందులోనూ ఆ బాణానికి అగ్ని వెలుగుతూ ఉండడం విశేషం. వంద శాతం కచ్చితత్వంతో గురి చూసి బాణాన్ని సంధించిందా యువతి. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇదే వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయంక కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒలింపిక్ టార్చ్‌ను ఇలా వెలిగించడం గొప్ప ఐడియా అంటూ క్యాప్షన్ జోడించారు. మరి ఈ అద్భుతమైన ట్యాలెంట్‌ను మీరూ చూసేయండి.
Would be a great idea if the Olympic torch is lit like this…. pic.twitter.com/acfOVCIipA
— Harsh Goenka (@hvgoenka) November 7, 2021
Also Read: Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..
Sonam Kapoor: భర్త ఒడిలో ఒదిగిన సోనమ్ కపూర్.. వైరల్ అవుతున్న పిక్స్