Horse in Shopping Mall: ఓనర్‌తో కలిసి దర్జాగా షాపింగ్ చేస్తున్న గుర్రం.. ఏం చేసిందంటే..?
మీరు ఎప్పుడైనా ఓ గుర్రం షాపింగ్ చేయడం చూసారా? గుర్రం షాపింగ్ చేయడమేంటి? ఈ మధ్య షాపింగ్ మాల్స్‌లో గడ్డి కూడా అమ్ముతున్నారా? అనుకోకండి. పాపం దానికి ఏం అవసరం పడిందో? లేకపోతే ఓనర్‌తో కలిసి సరదాగా షాపింగ్ మాల్ చూడాలనుకుందో మొత్తానికి ఓ తెల్లని గుర్రం షాపింగ్ మాల్‌లోకి ఎంటరయింది. దాని ఓనర్ దానిపైన స్వారీ చేస్తుండగా ఆ అశ్వం షాపింగ్ మాల్ అంతా కలియదిరిగింది.
మీరు ఎప్పుడైనా ఓ గుర్రం షాపింగ్ చేయడం చూసారా? గుర్రం షాపింగ్ చేయడమేంటి? ఈ మధ్య షాపింగ్ మాల్స్‌లో గడ్డి కూడా అమ్ముతున్నారా? అనుకోకండి. పాపం దానికి ఏం అవసరం పడిందో? లేకపోతే ఓనర్‌తో కలిసి సరదాగా షాపింగ్ మాల్ చూడాలనుకుందో మొత్తానికి ఓ తెల్లని గుర్రం షాపింగ్ మాల్‌లోకి ఎంటరయింది. దాని ఓనర్ దానిపైన స్వారీ చేస్తుండగా ఆ అశ్వం షాపింగ్ మాల్ అంతా కలియదిరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పరుగులు తీస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి షాపింగ్ కోసం ఓ మాల్‌కు వచ్చాడు. అతను తన గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చాడు. సరాసరి షాపింగ్ మాల్‌లోపలికి వెళ్లాడు. మాల్‌లో కలియదిరుగుతూ తనకు కావలసిన వస్తువులు ఎక్కడున్నయో చూసుకుంటున్నాడు. అయితే గుర్రం మాత్రం ఎలాంటి హడావిడీ చేయకుండా, అక్కడి వస్తువులజోలికి వెళ్లకుండా చాలా ప్రశాంతంగా అతడిని మాల్‌లో తిప్పుతోంది. అతని చేతిలో ఓ ప్లాస్టిక్ బకెట్ ఉంది. బహుశా అది అతను గుర్రం కోసమే కొని ఉంటాడు. అతను అలా గుర్రంపై షాపింగ్ మాల్‌లో స్వారీ స్తుంటే అక్కడున్నవారంతా తమ మొబైల్స్‌లో వీడియో రికార్డు చేశారు. ఇది టెక్సాస్‌లో జరిగినట్టు తెలుస్తోంది. ఓ యూజర్ ఈ వీడియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించగా.. వందల్లో లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేశారు. టెక్సాస్‌లో ఇది మామూలే అని కొందరంటే.. ఆ గుర్రం మాల్‌లో దూకుడుగా ప్రవర్తించకపోవడం విశేషం అంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..