Viral: రైల్వే స్టేషన్‌లో కుక్కల్లా అరుపులు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వెయ్యి మంది..!

Updated on: Oct 01, 2023 | 9:25 AM

నలుగురు కూడితేనే రచ్చ అనుకుంటాం.. అలాంటిది వెయ్యి మంది ఒకే చోట చేరి గోల చేస్తే.. రచ్చ రంబోలానే.. వందలాది మంది ఒకే చోట గుమిగూడి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. ఇటువంటి ఉదంతమే బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు.

నలుగురు కూడితేనే రచ్చ అనుకుంటాం.. అలాంటిది వెయ్యి మంది ఒకే చోట చేరి గోల చేస్తే.. రచ్చ రంబోలానే.. వందలాది మంది ఒకే చోట గుమిగూడి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. ఇటువంటి ఉదంతమే బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు. అయితే ఉన్నట్టుండి కుక్కలా మొరగడం మొదలుపెట్టారు. సామూహికంగా అందరూ కోరస్ ఇస్తున్నట్లుగా కుక్కల్లా అరుస్తూ.. అటువైపు వచ్చిపోయే వారితో మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొరిగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ గా పిలుస్తారు. వీరంతా తమను తాము కుక్కలుగా భావిస్తుంటారని స్థానిక మీడియా పేర్కొంది. మాస్క్‌లు ధరించి కుక్కలను అనుకరిస్తారు. తమకు సరియైన గుర్తింపు రావడం కోసం చేస్తుంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో సోషల్ మీడియా యూజర్స్ నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..