Viral Video: నువ్వేం తల్లివి..? పాలు తాగలేదని 5 రోజుల శిశువును వేడి నూనెలో ముంచింది.
టెక్నాలజీ యుగంలోనూ మనుషుల ఆలోచనలు మారడంలేదు. ఇంకా మూఢనమ్మకాలను వదలడంలేదు. తాజాగా ఓ తల్లి చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు 5 రోజుల శిశువు పట్ల ఆమె ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
టెక్నాలజీ యుగంలోనూ మనుషుల ఆలోచనలు మారడంలేదు. ఇంకా మూఢనమ్మకాలను వదలడంలేదు. తాజాగా ఓ తల్లి చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు 5 రోజుల శిశువు పట్ల ఆమె ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిడ్డ పాలు తాగడంలేదని ఇంకా కళ్లైనా పూర్తిగా తెరవని ఆ లేత శిశువు వేళ్లను వేడి వేడి నూనెలో ముంచింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. బారాబంకీ జిల్లా ఫతేపుర్ ప్రాంతం ఇస్రౌలి గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు జూన్ 11న ఫతేపుర్ ఆరోగ్యకేంద్రంలో పండంటి మగబిడ్డ పుట్టాడు. మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి.. ఆ తర్వాత తల్లి పాలు తాగకపోవడంతో ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఏమిచేయాలో అర్థం కాని స్థితిలో పడింది. పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించింది. ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు ఇచ్చిన వెర్రి సలహాతో ఆమె ముందూవెనకా ఆలోచించకుండా వేడి వేడి నూనెలో బిడ్డ వేళ్లను ముంచేసింది. రాత్రి విధుల్లో ఉన్న నర్స్ దీన్ని గుర్తించి డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారికి వైద్యం చేసిన వైద్యుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా పిల్లలు పాలు తాగక గతంలో ఆసియా ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. దాంతో ఈసారికూడా బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!