Viral: హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే గత వారం రోజులుగా ఎక్కడో అక్కడ వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం రాత్రి నగరంలోని మురాద్ నగర్‌లో పడిన వర్షం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే గత వారం రోజులుగా ఎక్కడో అక్కడ వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం రాత్రి నగరంలోని మురాద్ నగర్‌లో పడిన వర్షం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఓ ఏరియాలో కేవలం ఒకేచోట వర్షం పడింది. అటూ ఇటూ వర్షం పడకుండా కేవలం ఒక్కచోట మాత్రమే వర్షం పడటం వింతగా చూశారు జనం. ఇదేం విచిత్రం అనుకుంటూ చర్చించుకున్నారు. మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్ ఏరియాలో కురిసింది ఈ విచిత్రమైన వర్షం. స్థానిక కాలనీలోని ఒక చిన్న గల్లీలో ఒకే దగ్గర వర్షం పడింది. మళ్లీ ఆ వర్షం ఇటుపక్క, అటుపక్క గానీ కురవట్లేదు. జనాలు ఈ వింత వానని చూస్తూ అలాగే రోడ్డుపై నిలబడిపోయారు.
వింతగా చూస్తూ ఆ వర్షాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఒక ఇంటి ముందు కురుస్తున్న వర్షం మళ్లీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక్కోసారి వాతావరణంలో జరిగే మార్పుల వల్లే ఇలా అవుతుందని కొందరు అంటుంటే.. మరికొందరు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, అందుకే ఇలా అవుతుందని అంటున్నారు. ఆ కాలనీ ప్రజలకు ఇది చాలా వింతగా తోచింది. దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వర్షాల గురించి భయపడాల్సింది ఏమీ లేదని వాతావరణ అధికారులు తెలిపారు. చిన్నపాటి మబ్బు పేరుకున్నప్పుడు ఆ కొంచెం ప్రాంతంలోనే వాన కురిసే అవకాశం ఉంటుందని, అదేమీ వింతకాదని తెలిపారు. అలాంటి వర్షం ఎక్కువ సేపు ఉండదని, కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.