Family Froze: అమెరికాలో గడ్డకట్టుకుపోయి మృతి..! గుజరాతీల కేసులో రెండేళ్లకు అరెస్ట్‌లు.

|

Mar 02, 2024 | 1:19 PM

రెండేళ్ల క్రితం 2022లో జరిగిన మానవ అక్రమ రవాణా కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగోలో అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులతో కూడిన గుజరాతీ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా వారు చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన హర్షకుమార్ పటేల్‌ను చికాగో విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

రెండేళ్ల క్రితం 2022లో జరిగిన మానవ అక్రమ రవాణా కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగోలో అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులతో కూడిన గుజరాతీ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా వారు చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన హర్షకుమార్ పటేల్‌ను చికాగో విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. పటేల్‌ మానవ అక్రమ రవాణా అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మిన్నెసోటా కోర్టులో క్రిమినల్ కేసు పై విచారణ మొదలైంది. 2022, జనవరి 19న గుజరాత్‌కు చెందిన జగదీష్ పటేల్, అతని భార్య వైశాలిబెన్ పటేల్, పిల్లలు విహంగీ పటేల్ , ధార్మిక్ పటేల్ కెనడా సరిహద్దుల నుంచి నడక ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ, చలికి తట్టుకోలేక గడ్డ కట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు, స్వాధీనం చేసుకుని, ఈ కేసుతో సంబంధమున్న స్టీవ్ షాండ్ ను అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని గ్యాంబ్లింగ్‌ డెన్‌కు హర్షకుమార్ పటేల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడని షాండ్ తెలిపాడు. వీరిద్దరూ ఫోన్‌లో పలు విషయాలు మాట్లాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2022, జనవరి 19న మిన్నెసోటాలోని చలి వాతావరణం గురించి కూడా వీరు ఫోనులో చర్చించుకున్నారట. మంచు తుఫాను పరిస్ధితులు ఉన్నందున జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులంతా తగిన దుస్తులు ధరించారో లేదో చూడాలని షాండ్‌కు పటేల్ ఓ సందేశంలో సూచించాడు. ఈ కేసు విచారణకు సంబంధించి ఓ అధికారి గుజరాత్ పోలీసులను కలిశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on