Rains Effect: గాలివాన బీభత్సం.. గాలికి ఎగిరిపడిన ఆరేళ్ళ చిన్నారి.! వీడియో.

|

Mar 20, 2024 | 8:42 PM

తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి.. పంటలు నాశనం చేస్తున్నాయి. కోతకొచ్చిన పంటలు నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు కూలి నివాసాలు కోల్పోయి బావురుమంటున్నారు కొందరు.. మరోవైపు గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపడి మృత్యువాతపడుతున్నారు.

తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి.. పంటలు నాశనం చేస్తున్నాయి. కోతకొచ్చిన పంటలు నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు కూలి నివాసాలు కోల్పోయి బావురుమంటున్నారు కొందరు.. మరోవైపు గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపడి మృత్యువాతపడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గుర్‌లో చెట్టుకొమ్మ విరిగి పడడంతో పదోతరగతి విద్యార్థి మృతిచెందాడు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం జాజితండాలో గాలి ఉద్ధృతికి ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలిక ఎగిరిపడి గాయాలపాలై చికిత్సపొందుతూ మృతిచెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గుర్‌కు చెందిన మన్నె సత్తయ్య, రేణుక దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్‌ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం మండల పరిధిలోని అహ్మదీపూర్‌ జడ్పీ హైస్కూల్‌లో పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు పొలం వద్ద ఉండడంతో సాయంత్రం అక్కడికి వెళ్లాడు.

అక్కడి నుంచి పశువులను తోలుకుని ఇంటికి వస్తున్న సమయంలో వర్షం రావడంతో చెట్టు కింద నిల్చున్నాడు. ఈదురు గాలులకు ఆ చెట్టు కొమ్మ విరిగి బాలుడి తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటు మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం జాజితండాలో మాన్‌సింగ్‌, మంజుల దంపతుల కూతురు సంగీత సోమవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారానికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడకు బలంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on