Fruits Tea: గ్రీన్, బ్లాక్ టీ కాదు.. ఇది ఫ్రూట్స్ టీ..! మరుగుతున్న టీలో అరటిపండు, సపోటాలు
ప్రస్తుత కాలంలో టక్నాలజీయే కాదు, ప్రయోగాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ప్రయోగాలంటే సైంటిస్టులు చేసే ప్రయోగాలనుకునేరు. వీధి వ్యాపారుల ప్రయోగాలు. రకరకాల వంటకాలతో మనవాళ్లకు రోజుకో వెరైటీ రుచి చూపిస్తున్నారు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు.
ఐస్‌క్రీమ్ సమోసాలు, ఐస్‌క్రీమ్ దోశ, మ్యాంగో పానీపూరీ, థమ్సప్ పానీపూరీ ఇలాంటి ఒకదానికొకటి సంబంధం లేని ఎన్నో కాంబినేషన్లు. తాజాగా ఓ వ్యక్తి అరటిపండ్లు, సపోటాపళ్లతో టీ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇదేంటి గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ గురించి విన్నాం కానీ ఈ ఫ్రూట్స్ టీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ వీడియోలో ఓ యువకుడు టీ తయారు చేస్తున్నాడు. మొదట మామూలుగానే టీ పెట్టిన అతను మరుగుతున్న టీలో ఓ అరటిపండు వేసి దానిని అందులో మిక్స్ చేశాడు. తర్వాత ఓ సపోటా పండును కూడా తొక్కతీసి వేశాడు. అలా ఓ ఐదు నిమిషాలు మరిగిన తర్వాత టీ కప్పుల్లో వేసి సర్వ్ చేసాడు. సదరు టీ దుకాణదారుడు తనను తాను ఐఏఎస్ చాయ్ వాలాగా పరిచయం చేసుకున్నాడు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఇదేం ఖర్మ.. టీలో పండ్లు వేయమేంటని మండిపడుతున్నారు. మరికొందరైతే ఇలా టీలో ఎప్పుడూ పండ్లను కలపకండి, విషంగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

