Secret Tunnel: ఆస్పత్రిలో బయటపడిన రహస్య సొరంగం.. బ్రిటిష్ కాలం నాటిదిగా అధికారులు వెల్లడి..
బ్రిటీష్ కాలం నాటి రహస్య సొరంగం బయటపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబై జేజే హాస్పిటల్ ప్రాంగణంలో దీనిని గుర్తించారు. నీటి లీకేజీని అరికట్టేందుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడిందన్నారు ఆసుపత్రి అధికారులు.
గ్రాంట్ మెడికల్ కాలేజ్, సర్ జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను జేజే హాస్పిటల్స్ అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పురాతన వైద్య సంస్థ ఇది. మహిళలు, పిల్లలకు చికిత్సలు అందించిన వార్డు భవనాన్ని అనంతరం నర్సింగ్ కాలేజీగా మార్చారు.ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. దాని శిలాఫలకంపై 1890 అని ఉంది. దీంతో ఈ సొరంగాన్ని 132 ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ రహస్య సొరంగాన్ని గుర్తించిన వెంటనే హాస్పిటల్ అధికారులు ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టరుకు, పురావస్తు శాఖ అధికారులకు తెలియజేశారు. 845లో నాటి బ్రిటీష్ పాలనలో ప్రారంభించిన చారిత్రక వైద్య కాలేజీ భవనం కింద రహస్య మార్గం ఉండవచ్చని ప్రచారం ఉందని, దీనిని బట్టి అది ఇదే కావచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..