Rare Diamond: గుడిమెట్లలో దొరికిన అరుదైన వజ్రం.. కృష్ణా ప్రాంతంలో వజ్రాలు లభ్యం.

|

Aug 16, 2023 | 5:33 PM

కృష్ణా పరివాహక ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం నిజమేనా అనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాకాలం వచ్చిందంటే చాలు రాయలసీమలో చాలా చోట్ల వజ్రాల కోసం వేట చేసేవారు. కానీ ఇప్పుడు ప్లేస్‌ మారింది. పల్నాడు జిల్లాలో బిగుబండకు చెందిన ఓ కుటుంబానికి దొరికిన వజ్రం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రం దొరికింది. ఇది అలాంటి ఇలాంటి వజ్రం కాదు.

కృష్ణా పరివాహక ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం నిజమేనా అనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాకాలం వచ్చిందంటే చాలు రాయలసీమలో చాలా చోట్ల వజ్రాల కోసం వేట చేసేవారు. కానీ ఇప్పుడు ప్లేస్‌ మారింది. పల్నాడు జిల్లాలో బిగుబండకు చెందిన ఓ కుటుంబానికి దొరికిన వజ్రం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రం దొరికింది. ఇది అలాంటి ఇలాంటి వజ్రం కాదు. షట్భుజి ఆకారంలో వజ్రం లభించింది. వజ్రానికి 6 కోణాలు ఉండటంతో మంచి డిమాండ్ వస్తోందంటున్నారు నిపుణులు. సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గుడిమెట్లలో వజ్రాల వేగ సాగిస్తోంది. ఈ క్రమంలో వారికి షబ్ బుజి వజ్రం లభించింది. సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయిల వరకు విలువ పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు 40 లక్షలు రూపాయిలు ఇస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. ఇక వజ్రాన్ని వెతికి కుటుంబ సభ్యులు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. గుడిమెట్ల ప్రాంతాన్ని పూర్వం రాజులు పాలించడంతో ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని వందలాది మంది వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. రాత్రిళ్ల సమయంలో కూడా గుడిమెట్లలో వెయిట్ చేసి వజ్రాల వేట సాగిస్తున్నారు. మొన్న ఒక్కరోజే మూడు వజ్రాల దొరికాయని చెప్పడం గుడిమెట్లకు జనాల తాకిడి పెరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...