Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చికెన్ ఉచితంగా ఇవ్వలేదని చెప్పులతో కొట్టారు..! వీడియో.
ప్రభుత్వాలెన్ని చర్యలు చేపట్టినా అణగారిన వర్గాలపై ఆగడాలు ఆగడం లేదు. యుపీలో ఓ దళితునిపై కొందరు దుండగుల దాష్టీకమొకటి వెలుగు చూసింది. లలిత్‌పూర్ జిల్లాలో మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వాలెన్ని చర్యలు చేపట్టినా అణగారిన వర్గాలపై ఆగడాలు ఆగడం లేదు. యుపీలో ఓ దళితునిపై కొందరు దుండగుల దాష్టీకమొకటి వెలుగు చూసింది. లలిత్‌పూర్ జిల్లాలో మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లలిత్‌పూర్ జిల్లాలో సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి వీధి వీధికీ తిరిగి చికెన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే బైక్‌పై గ్రామాల్లో తిరుగుతూ చికెన్ అమ్ముకుంటున్న సుజన్ దగ్గరనుంచి కొందరు వ్యక్తులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో రెచ్చిపోయారు. అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడిచేశారు. వదిలేయాలని ప్రాధేయ పడుతున్నా కనికరం లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారి పోటీసుల కంటపడింది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...