Bathing King Cobra: పాముకు స్నానం చేయించిన వ్యక్తి .. తర్వాత ఏమైందంటే..? వైరల్..
భారీ నాగుపాముకు ఓ వ్యక్తి ఎలాంటి తత్తరపాటు లేకుండా కాన్ఫిడెంట్‌గా స్నానం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బాత్‌రూంలో పాముకు సదరు వ్యక్తి భయం, తొట్రుపాటు లేకుండా నీళ్లతో కడుగుతున్న షాకింగ్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాముకు సెల్ఫ్ ప్రొటెక్షన్‌గా చర్మం ఉంటుందని, పాము తరచూ కుబుసం విడుస్తుందని,
భారీ నాగుపాముకు ఓ వ్యక్తి ఎలాంటి తత్తరపాటు లేకుండా కాన్ఫిడెంట్‌గా స్నానం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బాత్‌రూంలో పాముకు సదరు వ్యక్తి భయం, తొట్రుపాటు లేకుండా నీళ్లతో కడుగుతున్న షాకింగ్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాముకు సెల్ఫ్ ప్రొటెక్షన్‌గా చర్మం ఉంటుందని, పాము తరచూ కుబుసం విడుస్తుందని, దానికి స్వయంగా శుభ్రపరుచుకునే వ్యవస్ధ ఉండగా, అసలు నిప్పుతో చెలగాటమాడాల్సిన అవసరం ఏముందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక 19 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో మగ్ నుంచి నీటిని కోబ్రాపై పోస్తుండటం కనిపిస్తుంది. ఓ దశలో వ్యక్తి పాము తలను కూడా పట్టుకుని స్నానం చేయించడం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 10,000కు పైగా వ్యూస్ రాగా యూజర్లు పెద్దసంఖ్యలో కామెంట్స్‌తో రియాక్టయ్యారు. పాముతో పరాచకాలా అంటూ కొందరు యూజర్లు కామెంట్ చేయగా, అతడి ధైర్యం అద్భుతమని మరికొందరు యూజర్లు మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..