Manappuram Gold Loans: 10 కేజీల బంగారంతో మహిళ జంప్.. మణప్పురం గోల్డ్ లోన్స్‌కి షాక్.!
బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలను బట్టి గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత తమ బంగారాన్ని తిరిగి తీసుకుంటారు. ఇదంతా నమ్మకంమీద ఆధారపడి ఉంటుంది. తాజాగా వినియోగదారుల నమ్మకానికి, సంస్థ గుడ్‌విల్‌కే ఎసరు పెట్టింది ఓ ఉద్యోగిని. వినియోగదారులు తాకట్టు పెట్టిన సుమారు 10 కిలోల బంగారాన్ని ఎత్తుకుని ఉడాయించింది.
బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలను బట్టి గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత తమ బంగారాన్ని తిరిగి తీసుకుంటారు. ఇదంతా నమ్మకంమీద ఆధారపడి ఉంటుంది. తాజాగా వినియోగదారుల నమ్మకానికి, సంస్థ గుడ్‌విల్‌కే ఎసరు పెట్టింది ఓ ఉద్యోగిని. వినియోగదారులు తాకట్టు పెట్టిన సుమారు 10 కిలోల బంగారాన్ని ఎత్తుకుని ఉడాయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని కంకిపాడులో చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలోని కంకిపాడు గ్రామంలో ఉన్న మణప్పురం ఫైనాన్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న పావని.. కస్టమర్లు తమ బ్రాంచ్‌లో దాచుకున్న సుమారు 10 కేజీల బంగారంతో పరారైంది. ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టిన ఆమె.. ఎన్ని రోజులు గడుస్తున్నా ఆఫీస్‌కు రాకపోవడం, సిబ్బంది చేస్తే రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానం వచ్చి.. సదరు సంస్థ ఉన్నతాధికారులు లాకర్లలోని బంగారాన్ని చెక్ చేశారు. కస్టమర్లు దాచిన 10 కేజీల బంగారం కనిపించకపోవడంతో.. అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్రాంచిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రెండు నెలలుగా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. ఇదే అదనుగా భావించిన పావని, ఈ మరో వ్యక్తితో కలిసి బ్యాగుతో కారులో వెళ్లినట్లుగా స్థానిక రోడ్డులోని సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. పావనికి సహకరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం బంధువులు, సన్నిహితులను ఆరా తీస్తున్నారు. అలాగే ఆమె దొంగలించిన 10 కేజీల బంగారం.. మార్కెట్ వాల్యూ ప్రకారం 6 కోట్ల రూపాయల విలువ చేస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం పోయిందని సమాచారం రావడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

