AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusions: చూసే కళ్లను సైతం మాయ చేస్తున్న వాస్తవం.. జంకుతున్న డ్రైవర్లు.. అసలు విషయం ఏంటంటే..

Optical Illusions: రోడ్డుపై వెళ్తుంటే దూరన నీటి మడుగు ఉన్నట్లు కనిపిస్తుంది, అయితే దగ్గరికి వెళ్లే సరికి అక్కడ నీరు ఉండదు. దీనినే ఎండమావులు అంటారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనిపించే దానికి సైకాలజిస్ట్‌లు ఆప్టికల్ ఇల్యూజన్‌ అని పిలుస్తుంటారు...

Optical Illusions: చూసే కళ్లను సైతం మాయ చేస్తున్న వాస్తవం.. జంకుతున్న డ్రైవర్లు.. అసలు విషయం ఏంటంటే..
Optical Illusion
Narender Vaitla
|

Updated on: May 04, 2022 | 10:35 AM

Share

Optical Illusions: రోడ్డుపై వెళ్తుంటే దూరన నీటి మడుగు ఉన్నట్లు కనిపిస్తుంది, అయితే దగ్గరికి వెళ్లే సరికి అక్కడ నీరు ఉండదు. దీనినే ఎండమావులు అంటారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనిపించే దానికి సైకాలజిస్ట్‌లు ఆప్టికల్ ఇల్యూజన్‌ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం మీకు పైన కనిపిస్తోన్న ఫోటో కూడా అలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించినదే. ఓ వాహనదారుడు పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ ఈ వీడియో ఏముందంటే.. ఓ వాహనదారుడు టన్నెల్‌ గుండా వెళుతున్నాడు. ఒక మూల మలుపు దగ్గర కొన్ని నీళ్లు చేరాయి. టన్నెల్‌లో దారి పొడవునా ఉన్న లైట్స్‌ కారణంగా, ఆ నీళ్లున్న చోట లోయలా కనిపిస్తుంది. దీనికి కారణం లైట్‌ వెలుతురు నీటిలో రిఫ్లెక్ట్‌ కావడమే. దీంతో అటుగా వెళుతోన్న వాహనదారులంతా ఆ మూల మలుపు దగ్గర ఆగి, కాస్త పక్కకు జరిగి ముందుకు వెళుతున్నారు.

దీనంతటినీ వీడియోగా తీసిన సదరు వాహనదారుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన కళ్లు మనల్ని మోసం చేయడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

Also Read: Bulls Vs Lion: సింహాన్నే గడగడలాడించిన అడవి బర్రెలు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే.!

IPL 2022: వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలి.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ వెటోరి..

Aadi Sai Kumar: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ఆది సాయి కుమార్.. బ్లాక్ విడుదల ప్రకటించిన మేకర్స్..