Monkey Viral: ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.. ఆ తరువాతే అసలు ట్విస్ట్.!
అసలే కోతులు.. ఆపై వనం వీడి జనంలోకి వచ్చాయి. ఇంకేముంది..! ఊరంతా తిరుగుతూ.. మనుషులపైనే తిరగబడుతున్నాయి. అవి మనకు ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టు ఉంది పరిస్థితి. ఈ కోతుల స్వైరవిహారంతో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపూర్ తాలూకా తూబాగెరె గ్రామం వాసులు హడలిపోతున్నారు. సందు దొరికితే ఇంట్లోకి దూరుతున్న కోతులు ఏవి దొరికితే అవి ఎత్తుకుపోతున్నాయి.
అసలే కోతులు.. ఆపై వనం వీడి జనంలోకి వచ్చాయి. ఇంకేముంది..! ఊరంతా తిరుగుతూ.. మనుషులపైనే తిరగబడుతున్నాయి. అవి మనకు ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టు ఉంది పరిస్థితి. ఈ కోతుల స్వైరవిహారంతో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపూర్ తాలూకా తూబాగెరె గ్రామం వాసులు హడలిపోతున్నారు. సందు దొరికితే ఇంట్లోకి దూరుతున్న కోతులు ఏవి దొరికితే అవి ఎత్తుకుపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. ఇంట్లో ఐఫోన్‌కి ఛార్జింగ్ పెట్టగా.. సైలెంట్‌గా వచ్చి దాన్ని ఎత్తుకెళ్లిపోయిన కోతి సరాసరి సెల్ టవర్ పైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఆ ఫోన్ ఓనర్ బాధ అంతా ఇంతా కాదు. కోతి నుంచి ఫోన్ తిరిగి తీసుకునేందుకు అతను ముప్పు తిప్పలు పడ్డాడు. జనాలు పోగయ్యి అందరూ గట్టిగట్టిగా కేకలు వేయడంతో.. చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు ఫోన్‌ను కిందకు జారవిడిచింది కోతి. అయితే ఫోన్‌కు స్వల్ప డ్యామేజ్ అయినట్లు తెలిసింది.
గ్రామంలో కోతులు గుంపులు గుంపులుగా నిత్యం ఇళ్లకు వస్తున్నాయి. ఇంట్లో దొరికిన వస్తువులను తీసుకెళ్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని.. తమకు వానరాల నుంచి రక్షణ కల్పించాలంటున్నారు. కాగా కోతి ఐఫోన్ తీస్కోని టవర్ ఎక్కిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.