Viral: ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన వివాహం.. వధువుకి 102, వరుడికి వందేళ్లు.!
ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పనిలేదు, అలాగే వయసుతో కూడా సంబంధం లేదు. ఏ వయసువారైనా ప్రేమించవచ్చు.. పెళ్లి చేసుకోవచ్చు.. చేసుకుంటున్నారు కూడా.. అలాంటి ఎన్నో ఘటనలు మనం చూశాం. అది కామన్. కానీ ఇద్దరు శతాధిక వృద్ధులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూశారా? వందేళ్ల వయసులో పెళ్లేంటండి బాబు అనుకుంటున్నారా? ఇప్పుడే కదండి మాట్లాడుకున్నాం..
ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని! వయసు శరీరానికే కానీ, మనసుకు కాదని ఓ వృద్ధ జంట నిరూపించింది. అంతేకాదు వివాహం చేసుకొని ఏకంగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో 102 ఏళ్ల బామ్మ.. 100 ఏళ్ల వృద్ధుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్ ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరి మొత్తం వయసు 202 సంవత్సరాల 271 రోజులు. ఈ పెళ్లితో గత రికార్డు బద్దలై కొత్తగా వీరి పేరున ప్రపంచ రికార్డు నమోదైంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. వీరిద్దరూ పదేళ్లకుపైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఈ జంట ఒక్కటైంది. తాజాగా ఈ నెల 3న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. వీరి వివాహాన్ని గుర్తించి రికార్డు అందజేసింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ శతాధిక వృద్ధ జంట వివాహానికి ఇరు కుటుంబాల వారు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.