Man - Monkey: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ లోయలోపడిన వ్యక్తి..ఆ తర్వాత ఏమైంది అంటే..? వైరల్ వీడియో..

Man – Monkey: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ లోయలోపడిన వ్యక్తి..ఆ తర్వాత ఏమైంది అంటే..? వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 15, 2023 | 9:56 AM

ప్రస్తుత కాలంలో సెల్ఫీల పిచ్చి, సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. దాంతో అనేకమంది రకరకాల సహాసాలు చేస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు.


అబ్దుల్‌ షేక్‌ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్‌ నుంచి కొంకణ్‌ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వరందా ఘాట్‌ రోడ్‌లో ఉన్న వాఘ్‌జాయ్‌ గుడి వద్ద కారును ఆపాడు. ఆ ప్రాంతంలో కోతుల గుంపు కనిపించడంతో వాటితో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు. ఇందులో భాగంగా వాటితోపాటు తననుకూడా కవర్ చేసుకోవాలనే యత్నంలో కొండ పైనుంచి జారి లోయలో పడిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో లోయలో 500 మీటర్ల దిగువన అబ్దుల్‌ షేక్‌ మృతదేహాన్ని లభించింది. స్థానికుల సహాయంతో అతడిని వెళికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 15, 2023 09:56 AM