Boy cricket practice: చేపల వలతో బాలుడు క్రికెట్‌ ప్రాక్టీస్‌.. ముఖ్యమంత్రినే కదిలించాడుగా.. వైరల్ వీడియో..

Boy cricket practice: చేపల వలతో బాలుడు క్రికెట్‌ ప్రాక్టీస్‌.. ముఖ్యమంత్రినే కదిలించాడుగా.. వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 09, 2022 | 8:40 PM

మనదేశంలో క్రీడా ప్రతిభకు ఏ మాత్రం కొదవలేదు. మారుమూల గ్రామాల్లోనూ, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో సైతం మెరికల్లాంటి ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కావాల్సిందల్లా ఒకటే..


మనదేశంలో క్రీడా ప్రతిభకు ఏ మాత్రం కొదవలేదు. మారుమూల గ్రామాల్లోనూ, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో సైతం మెరికల్లాంటి ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కావాల్సిందల్లా ఒకటే.. కాసింత చేయూతనందించి ప్రోత్సహించడమే. ఈక్రమంలో ఒక కుర్రాడి బౌలింగ్ ప్రాక్టీస్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఆ ట్యాలెంట్ పేరు భరత్ సింగ్. రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ 16 ఏళ్ల బాలుడు తన ముందున్న కష్టాలను ఆత్మవిశ్వాసంతో క్లీన్‌ బౌల్డ్‌ చేస్తున్నాడు. ఎలాంటి వసతులు, వనరులు లేకపోయినా కేవలం ఫిషింగ్‌ నెట్‌ సహాయంతో క్రికెట్ ప్రాక్టీస్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భరత్ ఆటల్లోనే కాదు చదువులోనూ నెంబర్‌ వన్‌. కానీ పేదరికం అతని ప్రతిభకు అడ్డంకిగా మారింది. ఆ అడ్డంకులను ఎదుర్కొంటూనే ఆత్మవిశ్వాసంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు.భరత్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. కాగా ఇప్పటివరకు గ్రామానికి పరిమితమైన భరత్‌ ప్రతిభ ఇప్పుడు సరిహద్దులు దాటుతోంది. దీపక్‌ శర్మ అనే ఓ నెటిజన్‌ భరత్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో భరత్ తన సూపర్‌ బౌలింగ్‌తో ఒకే స్టంప్‌ను గురిపెట్టి పడగొడతాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏకంగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కూడా ఈ వీడియోకు ముగ్ధులయ్యారు. ‘ దేశంలోని నలుమూలల్లో అత్యద్భుత ప్రతిభ దాగి ఉందని, అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావడం మనందరి బాధ్యత అంటూ ట్విట్టర్‌ ద్వారా గుర్తు చేశారు. భరత్ కలలు సాకారమయ్యేందుకు అన్ని విధాలా సహాయం చేయాలంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ను ట్యాగ్‌ చేశారు రాహుల్‌. ఈ ట్వీట్‌కు గెహ్లాత్‌ కూడా స్పందించారు. ‘తప్పకుండా.. భరత్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం’ అని సమాధానమిచ్చారు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడానికి భరత్ జైపూర్ వెళ్లనున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 09, 2022 08:40 PM