Bhupen Hazarika Setu: నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెన.. ఎక్కడో తెలుసా..? వైరల్ వీడియో..

|

Sep 15, 2022 | 10:00 AM

Bhupen Hazarika Setu: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెన అందుబాటులోకి వచ్చింది. అస్సాం - అరుణాచల్‌ప్రదేశ్‌ల రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ వంతెనను నిర్మించారు.


మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెన అందుబాటులోకి వచ్చింది. అస్సాం – అరుణాచల్‌ప్రదేశ్‌ల రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ వంతెనను నిర్మించారు. భూపేన్‌ హజారికా సేతుగా నామకరణం చేసిన ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ. దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణం పూర్తి చేశారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా ఈ వంతెన తోడ్పడనుంది. భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా ఈ బ్రిడ్జిను పటిష్టంగా తీర్చిదిద్దారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతున్న తరుణంలో ఈ వంతెన భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడనుంది. అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతూ ‘భూపేన్‌ హజారికా సేతు’ బ్రిడ్జిని నిర్మించారు. తిన్‌సుకియా జిల్లాలో దక్షిణాన ఉన్న ధొలా నుంచి ఉత్తరాన ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించడం విశేషం. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్‌ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 15, 2022 09:58 AM