Child Constable: చైల్డ్ కానిస్టేబుల్‌గా ఐదేళ్ల బాలుడు నియామకం..! లెటర్ ఇచ్చి మరి..

|

Mar 30, 2023 | 9:47 AM

ఛత్తీస్‌గఢ్‌ పోలీసు చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుర్గుజా జిల్లాకు చెందిన నమన్ రాజ్వాడే పోలీసు కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. నమన్ వయస్సు కేవలం 5 సంవత్సరాలు.

ఛత్తీస్‌గఢ్‌ పోలీసు చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుర్గుజా జిల్లాకు చెందిన నమన్ రాజ్వాడే పోలీసు కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. నమన్ వయస్సు కేవలం 5 సంవత్సరాలు. సుర్గుజా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భావనా ​​గుప్తా నమన్‌కు నియామక పత్రాన్ని అందించారు. సుర్గుజా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ రాజ్‌వాడే 2021 సెప్టెంబర్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో కానిస్టేబుల్ భార్య, 5 ఏళ్ల కొడుకు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో చలించినపోయిన పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కారుణ్య నియామకం కింద నామన్ చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాత నామన్‌కు పూర్తి కానిస్టేబుల్ హోదా లభిస్తుంది. అంతవరకు చదువుకునేందుకు కావల్సిన అన్ని సదుపాయాలతో పాటు కానిస్టేబుల్‌ హోదాలో రావల్సిన జీతభత్యాలను పోలీస్ శాఖ అందించనుంది. ఐదేళ్ల చిన్నారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భావనా ​గుప్తా అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Follow us on