AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎమోజీ తెచ్చిన తంటా..!  థమ్స్‌ అప్‌ ఎమోజీతో రూ.50 లక్షల జరిమానా..

Viral: ఎమోజీ తెచ్చిన తంటా..! థమ్స్‌ అప్‌ ఎమోజీతో రూ.50 లక్షల జరిమానా..

Anil kumar poka
|

Updated on: Jul 16, 2023 | 8:54 AM

Share

చాలా మంది చాటింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. ఒక్కో ఎమోజీకి ఒక అర్థం ఉండడంతో అవతలి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఎమోజీతో సమాధానం ఇస్తుంటారు. ప్రస్తుతం రకరకాల ఎమోజీలు అందుబాటులో ఉండడంతో మెసెజ్ టైప్ చేసే బదులుగా సింపుల్‌గా ఎమోజీతో రిప్లై ఇస్తున్నారు.

కెనడాలోని సస్కట్చేవాన్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా ధాన్యం వ్యాపారం చేసుకుకునే ఓ వ్యక్తి, క్రిస్ యాక్టర్‌ అనే రైతు వద్ద పంటలను కొంటానని చెప్పాడు. నవంబర్‌లో పంటలు తనకు అమ్మాలని, మార్చి 2021లో ఆన్‌లైన్‌లో మెసెజ్ పంపించాడు. ఇందుకు క్రిస్ యాక్టర్ రిప్లై ఇస్తూ.. థంబ్స్ అప్ ఎమోజీని పంపించాడు. దీంతో తనకే పంటలు అమ్ముతాడని ఆ వ్యాపారి భావించాడు. అయితే నవంబర్‌లో క్రిస్ యాక్టర్ పంటను ఆ వ్యాపారికి అందించలేకపోయాడు. అప్పటికి పంటల ధర కూడా బాగా పెరిగింది. కాంట్రాక్ట్‌కు అంగీకారం తెలుపుతూ థంబ్స్ అప్ ఎమోజీని ఉపయోగించినా, వారిమధ్య ఒప్పందాన్ని ధృవీకరించలేదు. అయితే తనకు ధాన్యం విక్రయించనందుకు ఈ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. థంబ్స్ అప్ ఎమోజీతో ధృవీకరించాలని కోరాడు. విచారణ చేపట్టిన కెనడాలోని కోర్టు, థంబ్స్-అప్ ఎమోజీని అధికారిక సంతకంగా గుర్తించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రైతుకు 50 లక్షల జరిమానా విధించింది. ఏదో చూద్దాంలే అనే ఉద్దేశంతో థమ్స్ అప్ ఎమోజీని పంపించిన రైతు చివరికి 50 లక్షల జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. థంబ్స్-అప్ ఎమోజీని సాధారణంగా ఆమోదాన్ని తెలపడానికి లేదా సరే అని సూచించడానికి ఉపయోగిస్తారు. అవతలి వ్యక్తి మెసెజ్‌ను బట్టి ఓకే అనుకుంటే థంబ్స్-అప్ ఎమోజీ ఉపయోగించుకోవచ్చు. అలాగే వేర్వేరు హ్యాండ్ ఎమోజీలకు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. అందుకే ఎమోజీలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow Us