Dog Viral Video: టీవీలో మాంసం ముక్కలు చూసి.. కుక్క ఏం చేసిందో తెలుసా..?

|

Jun 28, 2022 | 9:38 PM

కళ్లెదున ఇష్టమైన మాంసం ముక్క కనిపించినా.. అందుకోలేక అవస్థలు పడింది ఓ కుక్క. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది టీవీలో కనిపిస్తున్న మాంసం అని తెలియక,


కళ్లెదున ఇష్టమైన మాంసం ముక్క కనిపించినా.. అందుకోలేక అవస్థలు పడింది ఓ కుక్క. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది టీవీలో కనిపిస్తున్న మాంసం అని తెలియక, నిజమైన మాంసమే అని భ్రమ పడుతూ ఆవురావురుమని ఆరాటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.ఇంట్లోని వ్యక్తులతో పాటు పెంపుడు కుక్క కూడా టీవీ చూస్తోంది. ఇంతలో టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. అందులో మాంసం ముక్కలు కనిపించడంతో.. టీవీ ముందు కూర్చున్న కుక్కకు ఒక్కసారిగా నోరూరింది. వెంటనే ఆ ముక్కను అందుకోవాలని ప్రయత్నించింది. పాపం.. అది నిజమని తెలియని ఆ కుక్క.. టీవీ స్క్రీన్‌ను నాకుతూ ఆస్వాధించింది. అయితే, కుక్క అలా చేయడాన్ని వీడియో తీసిన యజమాని.. సంబంధిత వీడియోను రికార్డ్‌ చేసి, తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 28, 2022 09:38 PM